Fact Check: పహల్గామ్ ఉగ్రవాద దాడి - వైరల్ వీడియో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి క్షణాలను చూపిచడంలేదు

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి క్షణాలను చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 24 April 2025 8:42 PM IST

Fact Check: పహల్గామ్ ఉగ్రవాద దాడి - వైరల్ వీడియో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి క్షణాలను చూపిచడంలేదు
Claim:జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించడానికి ముందు భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య ఆనందకరమైన చివరి క్షణాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ లేదా అతని భార్య కనిపించడం లేదు. ఇందులో వేరే జంట ఉన్నారు, వారు తాము బతికే ఉన్నారని, వీడియోకి ఉగ్రవాద దాడికి సంబంధం లేదని న్యూస్‌మీటర్‌కు ధృవీకరించింది.
Hyderabad: ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిలో భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ విషాదకరంగా మరణించిన తర్వాత, లెఫ్టినెంట్ నర్వాల్, అతని భార్య చివరి క్షణాలను చూపిస్తోంది అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

ఫేస్‌బుక్‌లో వీడియోని షేర్ చేసి, "పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ షేర్ చేసిన చివరి వీడియో! #Telugunewj #viralvideos" అని క్యాప్షన్‌లో రాశారు. (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వీడియోలో కనిపిస్తున్నది లెఫ్టినెంట్ నర్వాల్, అతని భార్య కాదు. అది వేరే ఓ జంట, వారు బతికే ఉన్నారని న్యూస్‌మీటర్‌ ధృవీకరించింది. ఆ వీడియోకు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధం లేదు.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇవే క్లెయిమ్‌లతో షేర్ చేయబడిన పోస్ట్ దొరికింది. ఈ పోస్ట్ కామెంట్లలో, ఒకరు వీడియో వాస్తవానికి వేరే జంటను చూపిస్తుందని ఎత్తి చూపారు. వీడియోలో ఉన్న వ్యక్తులలో ఒకరైన యాషికా శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా కామెంట్‌లో ట్యాగ్ చేశారు.

ఈ కామెంట్లో ఉన్న లీడ్ ద్వారా నిజానిజాలు వివరిస్తూ ఆశిష్ సెహ్రావత్, యాషికా శర్మ వారి ఖాతాలలో పోస్ట్ దొరికింది. (ఆర్కైవ్)

వీడియోలో, వైరల్ ఫుటేజ్ వారిదేనని, లెఫ్టినెంట్ నర్వాల్, అతని భార్య కాదని ఆ జంట తేల్చిచెప్పారు . వారు నార్వాల్ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, వీడియో ఎలా దుర్వినియోగం చేయబడిందో తమకు తెలియదని పేర్కొన్నారు. వీడియోని ఉపయోగించి తప్పుదారి పట్టించే పోస్ట్‌లను రిపోర్ట్ చేయమని ప్రేక్షకులను కోరినట్లు కనిపిస్తుంది.
రైల్వే ఉద్యోగి అయిన ఆశిష్ సెహ్రావత్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, వైరల్ అవుతున్న వీడియో ఏప్రిల్ 11 నుండి 15 మధ్య జమ్మూ కాశ్మీర్‌కు విహారయాత్ర కోసం వెళ్ళినప్పుడు రికార్డ్ చేయబడిందని చెప్పారు. ఈ జంట తమ పర్యటనలో శ్రీనగర్, సోన్‌మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్‌లను సందర్శించినట్లు వివరించారు.
“పహల్గామ్ దాడి తర్వాత, మేము సురక్షితంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి చాలా మంది మాకు కాల్ చేయడం ప్రారంభించారు. అప్పుడే మా వీడియో ఆన్‌లైన్‌లో దుర్వినియోగం అవుతోందని మేము
గ్రహించాం
” అని ఆశిష్ అన్నారు. దీనికి స్పందిస్తూ, వారు బతికే ఉన్నారని, విషాదకరమైన సంఘటనతో తమకు సంబంధం లేదని వీక్షకులకు తెలియజేయడానికి ఆ జంట వివరణ ఇస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసారని తెలిపారు.
ఉగ్రవాద దాడికి సంబంధించి తాము తీవ్ర బాధలో ఉన్నప్పటికీ, తప్పుడు సాకుల కింద తమ వీడియోను విస్తృతంగా షేర్ చేయడం వల్ల ద్వేషపూరిత సందేశాలు, వ్యాఖ్యలు వెల్లువెత్తాయని సెహ్రావత్ అన్నారు. "మాకు చాలా ప్రతికూలత వచ్చింది, చివరికి మేము అసలు వీడియోనే తొలగించేసాము" అని ఆయన అన్నారు. "కానీ అప్పటికే వీడియో వైరల్ అయింది."
కీలకాంశాలు:
దృశ్యాలు: వైరల్ వీడియోలో మహిళ ధరించిన దుస్తులు, దాడి జరిగిన రోజు లెఫ్టినెంట్ నర్వాల్ భార్య ధరించిన దుస్తులకు మధ్య వ్యత్యాసం కనిపించింది.
కాలక్రమం: ఏప్రిల్ 22 ఉగ్రవాద దాడికి చాలా రోజుల ముందు, ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 15 మధ్య జమ్మూ మరియు కాశ్మీర్‌ పర్యటనలో తీసిన వీడియో అని ఆ జంట పేర్కొన్నారు.
వార్త కథనాల ప్రకారం, లెఫ్టినెంట్ నర్వాల్ ఏప్రిల్ 16న హిమాన్షి నర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. మూడు రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది. ఇద్దరు ఏప్రిల్ 21న కాశ్మీర్‌కు బయలుదేరారు.

అదనంగా, పహల్గామ్ దాడికి మూడు రోజుల ముందు - ఏప్రిల్ 19, 2024న యాషికా శర్మ పోస్ట్ చేసిన మరో వీడియోను న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ వీడియోలో వైరల్ వీడియోలో ఉన్న అదే ప్రదేశంలో యాషికా శర్మ సాంప్రదాయ కాశ్మీరీ దుస్తులలో నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫుటేజ్ సంఘటనకు ముందు నాటిదని, లెఫ్టినెంట్ నర్వాల్, అతని భార్యకు సంబంధం లేదని తేల్చేసింది.(ఆర్కైవ్)

కాబట్టి, వైరల్ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు లెఫ్టినెంట్ నర్వాల్, అతని భార్యతో ఉన్న చివరి క్షణాలను చూపుతుందనే క్లెయిమ్ తప్పు. వీడియోలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారు, పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనతో వారికి ఎటువంటి సంబంధం లేదు.
Claim Review:జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించడానికి ముందు భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య ఆనందకరమైన చివరి క్షణాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ లేదా అతని భార్య కనిపించడం లేదు. ఇందులో వేరే జంట ఉన్నారు, వారు తాము బతికే ఉన్నారని, వీడియోకి ఉగ్రవాద దాడికి సంబంధం లేదని న్యూస్‌మీటర్‌కు ధృవీకరించింది.
Next Story