Fact Check: పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ సదస్యుడు దయ చూపమని వేడుకుంటున్నాడా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ సదస్యుడు పదే పదే చేతులు ముడుచుకుని వేడుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

By -  K Sherly Sharon
Published on : 23 Feb 2026 10:01 PM IST

Fact Check: పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ సదస్యుడు దయ చూపమని వేడుకుంటున్నాడా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ సదస్యుడు పదే పదే చేతులు ముడుచుకుని వేడుకుంటున్న వీడియో
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియోలో ఉద్రేకంతో మాట్లాడుతున్న వ్యక్తి పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీలో ఒక క్రైస్తవ శాసనసభ్యుడు.

Hyderabad: పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ సదస్యుడు పదే పదే చేతులు ముడుచుకుని వేడుకుంటున్న వీడియో అని క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో, ఒక వ్యక్తి బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా ఉద్రేకంతో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు.

ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాసారు: పాకిస్తాన్ పార్లమెంట్‌లో హిందూ ప్రతినిధి కేకలు చూడండి! అలాంటి సమయం రాకుండా ఉండాలంటే, ఇప్పుడే మేల్కొనండి. పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఒక హిందూ ఎంపీ హిందువుల రక్షణ కోసం పదే పదే చేతులు ముడుచుకుని, తన కుమార్తెలు మరియు ఇతర హిందూ బాలికలపై జరుగుతున్న దారుణాలను అంతం చేయాలని ఎలా డిమాండ్ చేస్తున్నారో చూపించే ఈ వీడియోను లౌకిక ముసుగు నాయకులు చాలా జాగ్రత్తగా చూడాలి. భారతదేశంలో మైనారిటీలు అనుభవిస్తున్న అధికారాలను ఊహించుకోండి, పాకిస్తాన్‌లోని మైనారిటీలు తమ రక్షణ కోసం వేడుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువులది ఇదే పరిస్థితి చివరికి కాశ్మీర్ హిందువులది ఇదే పరిస్థితి ఇది సనాతన హిందూ సమాజానికి గొప్ప పాఠం; మనం దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ వీడియోలో ఉద్రేకంతో మాట్లాడుతున్న వ్యక్తి పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీలో ఒక క్రైస్తవ శాసనసభ్యుడు.

వీడియో కీఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించి 15 సెప్టెంబర్ 2022న X వినియోగదారు పోస్ట్ చేసిన అదే వీడియోను కనుగొన్నాం . వీడియోలోని వ్యక్తి పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన క్రైస్తవ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు తారిక్ మాసిహ్ గిల్ అని, పాకిస్తాన్ ప్రభుత్వం సహాయంతో 12 ఏళ్ల క్రైస్తవ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చారని ఆరోపిస్తూ ఉద్రిక్తంగా మాట్లాడారని ఈ పోస్టులో పేర్కొన్నారు.

కీవర్డ్ శోధనల ద్వారా ఫేస్‌బుక్‌లో "పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీ మాజీ సభ్యుడు తారిక్ మాసిహ్ గిల్, 12 ఏళ్ల బాలికను బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు." అనే అదే వీడియోను షేర్ చేసారు.

ఏప్రిల్ 19, 2023 నాటి పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ వెబ్‌సైట్ ఆర్కైవ్డ్ వెర్షన్ ప్రకారం గిల్ క్రైస్తవ సమాజానికి చెందినవాడు. ఆయన 2013-18 మధ్యకాలంలో పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు, మానవ హక్కులు & మైనారిటీల వ్యవహారాల పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. 2018 సార్వత్రిక ఎన్నికలలో ముస్లింయేతరులకు రిజర్వు చేయబడిన ఎనిమిది సీట్లలో ఒకదాని ద్వారా వరుసగా రెండవసారి పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడిగా ఆయన తిరిగి ఎన్నికయ్యారు.

23 సెప్టెంబర్ 2022 నుండి గిల్ బలవంతంగా బాల్య వివాహం చేయబడి, మతం మార్చబడిన 13 ఏళ్ల జరియా పెర్వైజ్ కోసం తన స్వరం వినిపించాడని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు, బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ కోసం శాసనసభలో తన గళాన్ని వినిపిస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.

వీడియోలో బలవంతపు మాత మార్పిడులకు వ్యతిరేకంగా ఉద్రేకంతో మాట్లాడుతున్న వ్యక్తి పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీలో ఒక క్రైస్తవ శాసనసభ్యుడు. కాబట్టి, వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియోలో ఉద్రేకంతో మాట్లాడుతున్న వ్యక్తి పాకిస్తాన్ పంజాబ్ అసెంబ్లీలో ఒక క్రైస్తవ శాసనసభ్యుడు.
Next Story