Hyderabad: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశంపై సైనిక దాడి చేయబోతోంది అని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
విమానంలో కూర్చున్న ఒక పాకిస్తాన్ సైనికుడు ఏడుస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాశారు, "భారత్‌తో యుద్ధం చేయలేం... వెక్కివెక్కి ఏడుస్తున్న పాక్ ఆర్మీ..." (ఆర్కైవ్)
Fact Check:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో పాతది.
వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వైరల్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చూడగలం. 2025 మర్చి 8 న ఈ వీడియోని పోస్ట్ చేసి, క్యాప్షన్‌లో మొదటిసారిగా విమానంలో కూర్చున్న పాక్ సైనికుడు అని రాసి ఉన్నట్లు కనిపిస్తుంది. పహాల్గమ్ ఉగ్రవాద దాడి 2025 ఏప్రిల్ 22న జరిగింది. అంటే ఉగ్రవాద దాడి కంటే ముందుగానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.
వైరల్ వీడియో 2024 సెప్టెంబర్ 2న కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయబడినట్లు గుర్తించాం. ఈ పోస్టులో వైరల్ వీడియో పొడిగించిన వెర్షన్ ఉంది, అందులో పాక్ సైనికుడు నవ్వుతున్నట్లు చూడవచ్చు. ఈ పోస్టులో "ఈ సోదరుడు విమానంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కావచ్చు... నవ్వు ఆపుకోలేకపోతున్నాడు..." అని రాశారు.
భారతదేశంతో యుద్ధంలో పోరాడటానికి నిరాకరించి ఏడుస్తున్న పాకిస్తాన్ సైనికుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. ఈ వీడియో పాతది.