హైదరాబాద్: సింధూ నాగరికతకు చెందిన అరుదైన ‘అసలు పశుపతి ముద్ర’ ఇదేనంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
పోస్టుల ప్రకారం, ఈ ముద్ర సుమారు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నాటిదని, మూడు తలలతో ఉన్న కూర్చున్న ఆకృతి –“ప్రోటో-శివ” రూపంగా భావించబడే చెరువును–1920ల్లో మొహెంజో దారో తవ్వకాల సమయంలో కనుగొన్నారని చెబుతున్నారు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ చిత్రాన్ని “క్రీ.పూ. 2500 పశుపతి ముద్రిక.” అంటూ షేర్ చేశాడు. (ఆర్కైవ్)
ఇలాంటి మరొక పోస్ట్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ చేసిన పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. ఇది AI ద్వారా సృష్టించిన చిత్రం.
అయితే అసలు పశుపతి ముద్ర ఏది?కీవర్డ్ సెర్చ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెందిన Indian Culture అధికారిక వెబ్‌సైట్‌లోని అసలు పశుపతి/ప్రోటో-శివ ముద్రను గుర్తించాము.ఈ ముద్ర మొహెంజో దారో తవ్వకాలలో బయటపడినదిగా, సుమారు క్రీస్తుపూర్వం 2500 నాటిదిగా పురావస్తు అధ్యయనాల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
వైరల్ ఫోటోతో అసలు పశుపతి ముద్రను పోల్చితే స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి.
అసలు ముద్రలో కనిపించే భంగిమ, చెక్కిన శైలి, ఆకృతుల వివరాలు–అన్నీ ఇండస్ వ్యాలీ ముద్రలకు ప్రత్యేకమైన లక్షణాలు.కానీ వైరల్ ఫోటోలో ముఖభావాలు, ఉపరితల ముగింపు (polish), ఆకృతుల లోతులు—అన్నీ మితిమీరిన విధంగా ఉండి, AI ఆర్టిఫాక్ట్స్‌లా కనిపిస్తున్నాయి.
అలాగే వైరల్ ఫోటోను ఏ పురావస్తు రికార్డులు, ప్రభుత్వ డేటాబేసులు, పరిశోధనా ప్రచురణలు కూడా ‘పశుపతి ముద్ర’గా నమోదు చేయలేదు.
చిత్ర విశ్లేషణవైరల్ చిత్రం AIతో రూపొందించబడిందేమోనని అనుమానంతో, గూగుల్ SynthID, Hive Moderation వంటి AI-కంటెంట్ డిటెక్షన్ టూల్స్‌తో పరీక్షించాము.రెండు టూల్స్ కూడా ఈ చిత్రాన్ని AI-జనరేటెడ్ అని గుర్తించాయి.
సింధూ నాగరికత కాలం నాటి 2500 BCE పశుపతి/ప్రోటో-శివ ముద్ర ఇదేనంటూ వైరల్ అవుతున్న ఫోటో అసలు కాదు.ఇది AI తయారు చేసిన చిత్రం.అందువల్ల, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.