నిజమెంత: ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించినవి అంటూ 2020 నాటి ఫోటోలు తప్పుగా లింక్ చేశారు

ఈ వైరల్ పోస్టుల్లోని ఫోటోలు ఇటీవలివి కావని న్యూస్ మీటర్ గుర్తించింది. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ విమాన ప్రమాదం గురించి కాకుండా 2020లో శిక్షణా విమానం కూలిపోయిన ప్రదేశానికి సంబంధించిన విజువల్స్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Newsmeter Network  Published on  21 May 2024 4:18 PM IST
నిజమెంత: ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించినవి అంటూ 2020 నాటి ఫోటోలు తప్పుగా లింక్ చేశారు
Claim: ఈ ఫోటోలు 2020 నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇరాన్ లో కూలిపోయిన శిక్షణా విమానానికి సంబంధించిన శకలాలు.
Fact: ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, దేశ విదేశాంగ మంత్రి, పలువురు వ్యక్తులు మే 20న దేశంలోని వాయువ్య ప్రాంతంలో పొగమంచు, పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అజర్ బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగివస్తూ, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో రైసీ దుర్మరణం పాలయ్యారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విషాదకర రీతిలో మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం రైసీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి. క్రాష్ సైట్‌కు సంబంధించిన చిత్రాలు అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా ఆ పోస్టుల్లో పెడుతున్నారు.

“WW3 ALERT… NEW PICTURE RELEASED OF HELICOPTER CRASH THAT KILLED IRAN PRESIDENT EBRAHIM RAISI,” అంటూ ట్విట్టర్ ప్రీమియం యూజర్ పోస్టు పెట్టారు. (archive)


Sulaiman Ahmed (archive) అనే ట్విట్టర్ యూజర్ “BREAKING: MANY BODIES OF THOSE DIED IN IRAN PRESIDENT RAISI HELICOPTER CRASH HAVE BEEN BURNT AND CANNOT BE IDENTIFIED.” అంటూ కొన్ని ఫోటోలను పోస్టు చేశారు.


నిజ నిర్ధారణ:

ఈ వైరల్ పోస్టుల్లోని ఫోటోలు ఇటీవలివి కావని న్యూస్ మీటర్ గుర్తించింది. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ విమాన ప్రమాదం గురించి కాకుండా 2020లో శిక్షణా విమానం కూలిపోయిన ప్రదేశానికి సంబంధించిన విజువల్స్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించిన తర్వాత, తెల్లటి రెక్కలతో కూలిపోయిన నీలిరంగు విమానం మినహా మిగిలిన అన్ని చిత్రాలను ఏప్రిల్ 22, 2020న టెహ్రాన్‌కి చెందిన వెబ్‌సైట్ రోక్నా ప్రెస్ ద్వారా ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.

2020లో ఇరాన్‌లోని మజాందరన్ ప్రావిన్స్‌లోని సల్మాన్‌షహర్ జిల్లాలో కూలిపోయిన పోలీసు బలగాలకు చెందిన శిక్షణా విమానం శకలాలని వెబ్‌సైట్ పేర్కొంది.


మే 2020లో జహాన్ న్యూస్ అనే మరో వెబ్‌సైట్ ప్రచురించిన చిత్రాలను కూడా మేము కనుగొన్నాము. బిషే కోలా నుండి టెహ్రాన్‌కు శిక్షణా విమానం వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. సల్మాన్‌షహర్ జిల్లాలోని ముతలాక్ సమీపంలో విమానం కూలిపోయిందని ఈ వెబ్‌సైట్ పేర్కొంది.


కాబట్టి, వైరల్ అవుతున్న ఈ చిత్రాలు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కాదని మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్.
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్.
Next Story