పుష్ప 2 ఫ్యాన్ వార్: అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా AI రూపొందించిన వీడియో వైరల్!
టాలీవుడ్‌కు చెందిన పలు హీరోల అభిమానులు అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా రూపొందించినట్లు భావిస్తున్న ఒక వైరల్ వీడియో. ఆయనను, సినిమా ని చెడు కోణంలో చూపిస్తుంది.
By Newsmeter Network Published on 26 Nov 2024 5:24 PM ISTహైదరాబాద్: 'పుష్ప 2: ది రూల్' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో తన చెన్నై రూట్స్ గురించి చెబుతూ, రజనీకాంత్ తనకి ఇన్స్పిరేషన్ అని చెప్పడం అభిమానులను ఆకర్షించింది. దీన్ని చూసి అభిమానులు ఆయన ఒదిగి ఉండే స్వభావాన్ని మెచ్చుకున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్, పుష్ప-1 కంటే కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుంది అని భావిస్తున్నారు. నవంబర్ 17న విడుదలైన ఈ ట్రైలర్‌లో పుష్పరాజ్ పాత్రను అద్భుతంగా చూపించారు. 'వైల్డ్ ఫైర్' మోడ్‌లో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన యాక్షన్, ఆకర్షణీయమైన డ్రామాతో ప్రేక్షకుల అంచనాలను పెంచాడు. క్రిమినల్ అండర్ వరల్డ్‌లో పుష్పరాజ్ ఎదుగుదల, సవాళ్ల మధ్య జరగనున్న పోరాటాలపై ఈ చిత్రం కొనసాగుతుంది.
ఇక తాజా వివాదం విషయానికి వస్తే, టాలీవుడ్ కు చెందిన కొందరి హీరో అభిమానులు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఒక AI video సృష్టించినట్లు భావిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో సినిమా ట్రైలర్ నుండి నాలుగు సీన్స్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మార్చబడ్డాయి.
అసలు ట్రైలర్ vs వైరల్ వీడియో
1. మొదటి సీన్: వైరల్ వీడియోలో అల్లు అర్జున్ రష్మిక మందన్నా కాలు కొరికినట్లు చూపించారు. అయితే, అసలు ట్రైలర్ (1:04 నిమిషం) లో అల్లు అర్జున్ ఆమె కాలుని తన గడ్డంతో నిమరడం మాత్రమే చూపించారు, కొరికడం కాదు.
2. రెండో సీన్: అసలు ట్రైలర్ (1:02 నిమిషం) లో రష్మిక అల్లు అర్జున్ పై నీళ్లు చల్లడం చూపిస్తారు. కానీ వైరల్ వీడియోలో, అల్లు అర్జున్ వారిపై తుపాకీతో కాల్చడం చూపించారు.
3. మూడో సీన్: వైరల్ వీడియోలో, అల్లు అర్జున్ సిగార్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు అంటుకునట్టు చూపించారు. కానీ అసలు ట్రైలర్ (0:46 సెకన్లలో), అల్లు అర్జున్ సిగార్ వెలిగించి, డాషింగ్ ఎంట్రీ ఇస్తాడు, కానీ ఎలాంటి అగ్నికి ప్రమాదానికి గురవ్వడు.
4. చివరి సీన్: అల్లు అర్జున్ తన సిగ్నేచర్ గెస్చర్ చేతితో గడ్డాన్ని తాకడం తర్వాత మహిళలు అతనిపై దాడి చేసినట్లు వైరల్ వీడియోలో చూపించారు. కానీ అసలు ట్రైలర్ లో (2:27 నిమిషం), ఈ సీన్ తరువాత, అతను ప్రతినాయకుడి కాల్పులనుండి తప్పించుకుని, బ్రిడ్జ్ ను పేల్చి అసమాన ధైర్యాన్ని చూపిస్తాడు.
ఈ వీడియో AI ద్వారా సృష్టించబడిందా?
NewsMeter ఆధునిక టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరీక్షించిగా. Hive Moderation టూల్ ఈ వీడియోను 99.9% AI ద్వారా రూపొందించబడిందని అని నిర్ధారించింది. Deepfake-O-Meter (DSP-FWA) ఈ వీడియో 99.2% AI ద్వారా రూపొందించబడిందని నివేదించింది. Deepware స్కాన్ చేసిన తర్వాత ఈ వీడియో అనుమానాస్పదమని ఫ్లాగ్ చేసింది.
కాబట్టి, ఈ వీడియో స్పష్టంగా AI తో తయారు చేసినదిగా నిర్ధారణ అయింది. హీరోల ఫ్యాన్స్ మధ్య విపరీతమైన అభిమానం( మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని) కారణంగానే ఇలాంటి వీడియోలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది.