నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా చూసి సమంత కన్నీళ్లు? నిజం ఇక్కడ తెలుసుకోండి...

నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. తండేల్ సినిమా సీక్రెట్ గా చూసిన సమంత ఏడ్చారని క్లెయిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon  Published on  25 Feb 2025 6:16 PM IST
నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా చూసి సమంత కన్నీళ్లు? నిజం ఇక్కడ తెలుసుకోండి...
Claim: నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా చూసి సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న కనిపిస్తున్న సమంత వీడియో క్లిప్ పాతది.

Hyderabad: నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసి సమంత రూత్ ప్రభు కన్నీళ్లు పెట్టుకుంది అని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సమంత ఉన్న ఒక వీడియో క్లిప్, నాగ చైతన్య ఉన్న వీడియో క్లిప్, ఇద్దరి పెళ్లి ఫోటోలు కినిపిస్తున్నాయి. "సీక్రెట్ గా సమంత తండాల్ సినిమా చూడడానికి వెళ్లి నాగచైతన్యను చూసి ఇంత ఏడుస్తుందో చూడండి" అని వీడియోపై రాసి ఉంది.

"తండెల్ సినిమా చూస్తూ ఏడుస్తున్న సమంత" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకి 22 లక్షల వ్యూస్, 50 వేల లైక్స్ ఉన్నాయి. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ వాదన తప్పు అని కనుగొంది. వైరల్ పోస్ట్‌లోని సమంత వీడియో క్లిప్ పాతది, తండేల్ సినిమాకు దీనికి సంబంధం లేదు.

వీడియో కి ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, "శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత ఇబ్బంది పడుతోంది" అనే శీర్షికతో 2023 జనవరి 10 యూట్యూబ్‌లో అప్లోడ్ చేయబడిన వీడియో దొరికింది. ఈ వీడియోలో 1:24 నిమిషం మార్కు వద్ద వైరల్ వీడియోలో సమంత కనిపిస్తున్న వీడియో క్లిప్ చూడగలం.

వైరల్ వీడియో క్లిప్ 2023 జనవరి 9న జరిగిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తీసింది అని అర్థం అవుతోంది. యూట్యూబ్ వీడియో మొత్తం పరిశీలిస్తే, సూటిగా కళ్ళల్లోకి వెలుగు పడుతోంది సమంత ఇబ్బంది పడినట్లు చూడగలం.

కీవర్డ్ సెర్చ్ ద్వారా ఇదే సందర్భాన్ని మరో కోణంలో చూస్పిస్తున్న యూట్యూబ్ వీడియో కనుగొన్నాం. ఈ వీడియోలో 0:24 నిమిషం మార్కు వద్ద సమంత లైట్ వల్ల ఇబ్బంది పాడడం, తర్వాత మొహం తిప్పుకోవడం కనిపిస్తుంది. వీడియోని "పాపం సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇబ్బంది పడ్డ సమంత" అనే శీర్షికతో 2023 జనవరి 9న అప్లోడ్ చేశారు.

నటి సమంత తండేల్ సినిమా చూసినట్లు ఎలాంటి కథనాలు మాకు దొరకలేదు. సమంత సోషల్ మీడియాలో కూడా తాను సినిమా చూసినట్లు, సినిమా గురించి మాట్లాడుతున్నట్లు ఎలాంటి పోస్టులు కూడా లేవు.

కాబట్టి వైరల్ వీడియో చేస్తున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:నాగ చైతన్య నటించిన 'తండేల్' సినిమా చూసి సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న కనిపిస్తున్న సమంత వీడియో క్లిప్ పాతది.
Next Story