Hyderabad: శిర్డీ సాయి ఆలయ ట్రస్ట్ హజ్ యాత్ర కోసం ముస్లింలకు ₹35 కోట్లు అందజేసిందని క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిర్డీ సాయి ఆలయంలో ఇచ్చిన విరాళాలను హజ్ యాత్ర కోసం ముస్లింలకు అందజేస్తుండగా, ఆలయానికి ఇక విరాళాలు ఇవ్వకండి అని హిందువులను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు.
ఈ పోస్టులో "శిర్డీ సాయి ఆలయ ట్రస్ట్ హజ్ యాత్ర కోసం ముస్లింలకు ₹35 కోట్లు అందజేసిందట!... మన హిందువుల విరాళాలను ముస్లింల హజ్ యాత్ర కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థలను అర్థం చేసుకోండి. దయచేసి శిర్డీ సాయి ఆలయంలో విరాళాలు ఇవ్వడం మానేయండి!" అని రాసి ఉంది.
ఈ వ్యాఖ్యలతో పాటు పోస్టుకు గూగుల్ సెర్చ్‌లో వచ్చిన సమాధానం స్క్రీన్ షాట్ కూడా జోడించారు. 'షిర్డీ ట్రస్ట్ హజ్ ప్యాకేజీ కోసం ఏదైనా మొత్తం విరాళంగా ఇచ్చిందా' అనే ప్రశ్న వేసినట్లు కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా "షిర్డీ సాయి ట్రస్ట్ హజ్ కోసం 35 కోట్లు విరాళంగా ఇచ్చింది" అని ఉంది.
ఈ పోస్టుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి శీర్షికలో ఈ విధంగా రాశారు, "శిర్డీ సాయి ఆలయ ట్రస్ట్ హజ్ యాత్ర కోసం ముస్లింలకు ₹35 కోట్లు అందజేసిందట!... మన హిందువుల విరాళాలను ముస్లింల హజ్ యాత్ర కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థలను అర్థం చేసుకోండి. దయచేసి శిర్డీ సాయి ఆలయంలో విరాళాలు ఇవ్వడం మానేయండి!" (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. షిర్డీ సాయి ట్రస్ట్ నుండి హజ్ యాత్ర కోసం ఎలాంటి విరాళాలు ఇవ్వలేదు.
ఇంత పెద్ద మొత్తం షిర్డీ సాయి ట్రస్ట్ నుండి హజ్ యాత్ర కోసం విరాళంగా ఇచ్చారా అని కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించి శోధించాం. కానీ షిర్డీ సాయి ట్రస్ట్ నుండి 35 కోట్ల రూపాయలు విరాళంగా హజ్ యాత్రికుల కోసం ఇచ్చినట్లు ధృవీకరించే వార్త కథనాలు ఏవి మాకు దొరకలేదు.
షిర్డీ సాయి ట్రస్ట్ వెబ్సైటులో కూడా ఈ విషయం గురించిన ఎలాంటి సమాచారం దొరకలేదు.
వైరల్ పోస్టులో ఉన్న స్క్రీన్ షాట్లో గూగుల్ ఇచ్చిన ఫలితంలో @kavita_tewari అనే ట్విట్టర్ (ప్రస్తుతం X) అకౌంట్ ద్వారా చేయబడిన పోస్టులో కనిపిస్తుంది.
@kavita_tewari అకౌంట్ను పరిశీలించిన తర్వాత స్క్రీన్ షాట్లో కనిస్పిస్తున్న పోస్ట్ తీసివేయబడింది అని తేలింది.
గతంలో కూడా షిర్డీ సాయి ట్రస్ట్ నుండి హజ్ యాత్ర కొరకు విరాళాలు వెళ్లాయని పుకార్లు వచ్చాయి. అప్పుడు వాటిని ఉద్దేశించి, ట్రస్ట్ సీఈఓ గా వ్యవహరించిన రాహుల్ జాదవ్ చేసిన వ్యాఖ్యను ETV Bharat 24 ఏప్రిల్ 2023న ప్రచురించిన కథనంలో చూడవచ్చు.
Fact Check: షిర్డీ సాయి ట్రస్ట్ నుండి హజ్ యాత్రికులకు 35 కోట్ల విరాళం? లేదు, ఇందులో నిజం లేదుఇలా తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వ్యాప్తి చేస్తూ, సంస్థానం పరువు నష్టం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అన్నట్లు పేర్కొన్నారు.
కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు న్యూస్‌మీటర్ నిర్ధారించింది.