Fact Check: ఇండియా-పాక్ టీ20 మ్యాచ్ ముందు శివ తాండవం పాట? లేదు, ఇది డబ్ల్యూపీఎల్‌2026 వీడియో

కొలంబోలో ఫిబ్రవరి 15న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ముందు 'శివ తాండవం' పాట స్టేడియంలో మారుమ్రోగింది క్లెయిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  K Sherly Sharon
Published on : 19 Feb 2026 9:59 AM IST

Fact Check: ఇండియా-పాక్ టీ20 మ్యాచ్ ముందు శివ తాండవం పాట? లేదు, ఇది డబ్ల్యూపీఎల్‌2026 వీడియో
Claim:ఇండియా, పాకిస్తాన్ మధ్య, కొలంబోలో ఫిబ్రవరి 15న, జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ముందు 'శివ తాండవం' పాట స్టేడియంలో మారుమ్రోగింది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్నది వడోదరాలో జనవరి 9న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మొదటి మ్యాచ్ ఓపెనింగ్ కార్యక్రమం.

Hyderabad: ఇండియా, పాకిస్తాన్ మధ్య, కొలంబోలో ఫిబ్రవరి 15న, జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ముందు 'శివ తాండవం' పాట స్టేడియంలో మారుమ్రోగింది క్లెయిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో స్టేడియంలో కొంతమంది ప్రదర్శకులు నడుస్తూ ఉండగా ‘అయిగిరి నందిని’ పాట వినిపిస్తోంది. ఈ వీడియోతో పాటు ప్రసారం అవుతున్న క్లెయిమ్ ప్రకారం, ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఈ ప్రదర్శన జరిగినట్లు చెబుతున్నారు.

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో, "నిన్న INDvsPAK మ్యాచ్ ప్రారంభం ముందు పాకిస్తాన్ ఉగ్రమరకళ గుండెలు ఆగేలా కొలంభో స్టేడియం గాయత్రిమత్రం& శివనామస్మరణంతో మారుమొగింది ఓంనమఃశివాయ జయహో భారత్" అని రాసి ఉంది. (ఆర్కైవ్)

Fact Check

వైరల్ అవుతున్న ఈ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ తేల్చింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది డబ్ల్యూపీఎల్‌ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం, కొలంబో స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ‘అయిగిరి నందిని’ ప్రదర్శన కాదు.

ఫిబ్రవరి 15న కొలంబో స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు ముందు హిందూ భక్తి గీతం ‘అయిగిరి నందిని’ వినిపించినట్లు ఎలాంటి వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు కూడా దొరకలేదు.

వైరల్ వీడియోలోని ఒక కీలక ఫ్రేమ్‌లో “టాటాడబ్ల్యూపీఎల్” అని ఉన్న బ్యానర్ కనిపించింది. డబ్ల్యూపీఎల్ అంటే మహిళల ప్రీమియర్ లీగ్. ఈ లీగ్ ప్రారంభం, 2023 నుంచే టాటా గ్రూప్ ఈ లీగ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. దీంతో ఈ వైరల్ వీడియో ఐసీసీ టీ20 పురుషుల వరల్డ్ కప్ మ్యాచ్‌లో జరిగిన ప్రదర్శన కాదని స్పష్టమైంది.

వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోను జనవరి 22న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ పోస్టులో ఉన్న వీడియోపై ఎలాంటి టెక్స్ట్ ఓవర్లే లేదు. కానీ అదే స్థానంలో ఇంగ్లీష్‌లో “సచేత్ పరంపర పెర్ఫార్మెన్స్ WPL 2026” అని ఉంది.

వీడియో క్యాప్షన్‌లో గాయకులు సచేత్, పరంపరా టాండన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ట్యాగ్ చేశారు. అందులో “WPL - #sachetparampara #sachettandon #paramparatandon @sachettandonofficial @sachetparamparaofficial” అని ఉంది.

అదే వీడియోను గాయకుడు సచేత్ టాండన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ షేర్ చేశారు. క్యాప్షన్‌లో “WPL 2026 - #sachetparampara #sachetparamparalive Shiv Tandav Live” అని ఉంది.

అదే ప్రదర్శనకు సంబంధించిన ఇతర వీడియోలను కూడా సచేత్ టాండన్ షేర్ చేశారు. అందులో వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదర్శకులు, డ్యాన్సర్లు ధరించిన దుస్తులే కనిపిస్తున్నాయి.

దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లు జనవరి 9న వడోదరాలోని కోటాంబి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. తొలి మ్యాచ్ సందర్భంగా సచేత్, పరంపరా టాండన్ ప్రత్యేక పెర్ఫార్మెన్స్ నిర్వహించారు.

ఈ వైరల్ వీడియో డబ్ల్యూపీఎల్‌ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూపిస్తున్నదని స్పష్టమైంది. కాబట్టి, వైరల్ వాదనలు తప్పు అని న్యూస్‌మీటర్ తేల్చింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్నది వడోదరాలో జనవరి 9న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మొదటి మ్యాచ్ ఓపెనింగ్ కార్యక్రమం.
Next Story