హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఒక న్యాయవాదిని కొడుతున్నట్లు కనిపిస్తోంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ “గవాయి గారి పై దాడి చేసిన వ్యక్తిని మనవాళ్లు చెంప పగలగొట్టారు.., (ఇది కదా మనకు కావల్సింది).. 👉కుక్క కాటు కి, చెప్పు దెబ్బ...”అని షేర్ చేశాడు. (ఆర్కైవ్)
ఇలాంటి మరిన్ని పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.(ఆర్కైవ్1, ఆర్కైవ్2)
Fact Check
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ వీడియో తాజా ఘటనతో సంబంధం లేనిది అని తేలింది.
వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, దానిలో “Team Anna member Prashant Bhushan brutally…” అనే టెక్స్ట్ కనిపిస్తోంది.
వీడియో వివరణలో,“కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite)కు మద్దతుగా మాట్లాడినందుకు టీమ్ అన్నా సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై ముగ్గురు యువకులు ఆయన సుప్రీంకోర్టు చాంబర్‌లో దాడి చేశారు” అని ఉంది.
అలాగే NDTV కూడా 2011 అక్టోబర్ 12న ‘సుప్రీంకోర్టులోని తన చాంబర్‌లో ప్రశాంత్ భూషణ్‌పై దాడి జరిగింది.’ అనే రిపోర్ట్ ప్రచురించింది.ఆ రిపోర్ట్ ప్రకారం, ముగ్గురు వ్యక్తులు భూషణ్‌పై ఆయన చాంబర్‌లో ఇంటర్వ్యూ మధ్యలో దాడి చేశారు. ఇతర న్యాయవాదులు వచ్చి ఆయనను రక్షించారు.
ఈ వివరాలు ప్రకారం వైరల్ వీడియో 2011 నాటిది, వీడియో ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడికి సంబంధించినది.
ఇక, రాకేష్ కిషోర్‌పై దాడి జరిగిందని ఏ మీడియా సంస్థ లేదా అధికారిక సమాచారం ఎక్కడా నివేదించలేదు.
వైరల్ అవుతున్న వీడియో పాతది. ఇది 2011లో న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడి వీడియో. న్యాయవాది రాకేష్ కిషోర్ కి ఈ వైరల్ వీడియో కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పు.