Fact Check: ఆసుపత్రిలో సోనియా గాంధీ చుట్టూ రాహుల్, ప్రియాంకా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఆసుపత్రి గదిలో ఆమె కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లు చూపే ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  K Sherly Sharon
Published on : 26 March 2026 10:06 PM IST

Fact Check: ఆసుపత్రిలో సోనియా గాంధీ చుట్టూ రాహుల్, ప్రియాంకా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, సోనియా గాంధీ చుట్టూ రాహుల్, ప్రియాంక ఉన్నట్లు ఈ చిత్రం చూపిస్తోంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ చిత్రం ఏఐ ద్వారా రూపొందించబడింది.

Hyderabad: రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, ఇన్ఫెక్షన్ కారణంగా మార్చి 24న సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో సోనియా గాంధీ చుట్టూ ఆమె కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఉన్నట్లు చూపే ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో ఈ శీర్షికతో పంచుకున్నారు, "దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చిన అమ్మ సోనియా గాంధీ గారు త్వరగా కోలుకోవాలని మా ప్రార్థన" (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

Fact Check

ఈ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. వైరల్ అవుతున్న ఈ చిత్రం ఏఐ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ద్వారా రూపొందించబడింది.

'రివర్స్ ఇమేజ్ సెర్చ్' ఉపయోగించి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడానికి సంబంధించిన వార్తల్లో, ఏ ఒక్క విశ్వసనీయ వార్తా సంస్థ కూడా ఈ వైరల్ చిత్రాన్ని ప్రచురించినట్లు కనిపించలేదు.

మార్చి 25న ప్రచురించిన ఒక నివేదికలో, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్ గంగా రామ్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాటలను ఉటంకిస్తూ ఇలా రాసింది, “సోనియా గాంధీ మంగళవారం రాత్రి 10:22 గంటలకు సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కడుపు, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ సోకిందేమోనని వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది, యాంటీబయాటిక్స్ ఇవ్వబడ్డాయి.”

చిత్రాన్ని నిశితంగా విశ్లేషించగా, అది చాలా నునుపుగా ఉన్నట్లు కనుగొన్నాం. దీనిని బట్టి, ఆ చిత్రంలో ఏఐచే రూపొందించిన కంటెంట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏఐ గుర్తింపు సాధనమైన హైవ్ మోడరేషన్‌ను ఉపయోగించి చిత్రాన్ని విశ్లేషించాం, ఆ చిత్రంలో 99.9 శాతం ఏఐ- రూపొందించిన లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉందని కనుగొన్నాం. ఈ సాధనం ఫలితాలు, ఆ చిత్రాన్ని ‘జెమిని3’ ఉపయోగించి రూపొందించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.

గూగుల్ డీప్‌మైండ్ సింథ్‌ఐడి డిటెక్టర్‌ను ఉపయోగించి, ఆ చిత్రాన్ని గూగుల్ ఏఐ ఉపయోగించి సృష్టించారని కనుగొన్నాం. ఈ డిటెక్టర్, గూగుల్ ఏఐ ద్వారా రూపొందించబడిన చిత్రాలలో నేరుగా పొందుపరిచిన డిజిటల్ వాటర్‌మార్క్‌లను గుర్తిస్తుంది.

వైరల్ చిత్రం ఏఐ ద్వారా రూపొందించబడిందని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవమని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ చిత్రం ఏఐ ద్వారా రూపొందించబడింది.
Next Story