Fact Check: కడపలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని వచ్చిన వార్తా కథనం నిజం కాదు

కడపలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారనే కథనం ఫేక్

By Sridhar  Published on  13 April 2024 8:15 AM GMT
TDP Chief Chandrababu Naidu extends support to Congress in Kadapa Lok sabha elections, TDP sensational decision, TDP National President decides to support Congress in Kadapa
Claim: టీడీపీ సంచలన నిర్ణయం, కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు లేఖను విడుదల చేశారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కడపలో కాంగ్రెసకు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అక్కడి టీడీపీ అభ్యర్థి సి. భూపేశ్ రెడ్డి ఫ్రెండ్లీ పోటీలో నిలుస్తారని పేర్కొన్నారు.
Fact: కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని వచ్చిన వార్తా కథనం నిజం కాదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ, బీజేపీతో సీట్ల పంపకాల ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేయనుంది, టీడీపీ మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే కడప లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సీ భూపేష్‌ రెడ్డిని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కడప లోక్‌ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు Way2News పేరిట ఓ వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"టీడీపీ సంచలన నిర్ణయం
కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు లేఖను విడుదల చేశారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కడపలో కాంగ్రెసకు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అక్కడి టీడీపీ అభ్యర్థి సి. భూపేశ్ రెడ్డి ఫ్రెండ్లీ పోటీలో నిలుస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. కడపలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు." అని వార్తా కథనం పేర్కొంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

అలాగే ABN Telugu పేరుతో, వైరల్ అయిన Way2News వార్తా కథనంలో అదే వాదనను నివేదించే ఒక న్యూస్ రిపోర్టింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


నిజ నిర్ధారణ:

కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తా కథనంలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
'టీడీపీ సంచలన నిర్ణయం' మరియు 'కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన నిర్ణయం' అనే కీలక పదాలను ఉపయోగించి మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము, కడప లోక్ సభ స్థానంలో టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు నివేదించే అధికారిక ప్రకటనలు లేదా ప్రెస్ నోట్‌లు మాకు కనుగొనబడలేదు.
మేము మరింత శోధించినప్పుడు, వైరల్ వార్తా కథనాన్ని వారు ప్రచురించలేదని పేర్కొంటూ Way2News అధికారిక హ్యాండిల్ ద్వారా X పై ఒక పోస్ట్‌ను కనుగొన్నాము.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

వైరల్ కథనంలోని వార్తలు ఫేక్ అని మరియు ABN లోగోతో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ మరియు ఎడిట్ చేయబడిందని ధృవీకరిస్తూ ABN Telugu ద్వారా X పై ఒక వీడియోను కనుగొన్నాము.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

వైరల్ వార్తా కథనంలో ఉన్నట్లుగా అదే దావాను కలిగి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుండి టీడీపీ కార్యకర్తలకు, ఎడిట్ చేయబడిన నకిలీ లేఖ సర్క్యులేషన్‌లో ఉన్నట్లుగా కనుగొన్నాము.
చివరిగా కడప లోక్ సభ స్థానంలో కానీ, మరెక్కడైనా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయం పై పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఎలాంటి లేఖ రాయలేదు.
కాబట్టి, Way2News పేరుతో వైరల్ అవుతున్న ఈ వార్తా కథనం నకిలీదని మేము నిర్ధారించాము.
Claim Review:News article claimed that TDP Chief Chandrababu Naidu made a sensational decision to extend support to the Congress in the Kadapa Lok Sabha seat.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని వచ్చిన వార్తా కథనం నిజం కాదు.
Next Story