Fact Check: ఉగ్రవాది అరెస్టుగా వైరల్ అవుతున్న తెలుగు సినిమా దృశ్యం..

భోపాల్‌లో పేలుడుకు ప్లాన్ చేస్తున్న ఆదిల్ కజ్మీని సీబీఐ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేసినట్లు చూపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

By -  K Sherly Sharon
Published on : 5 Dec 2025 9:57 PM IST

Fact Check: ఉగ్రవాది అరెస్టుగా వైరల్ అవుతున్న తెలుగు సినిమా దృశ్యం..
Claim:సీబీఐ, పోలీసులు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఆదిల్ కజ్మీ అనే ఉగ్రవాదిని అరెస్టు చేస్తున్న వీడియో. అతను భోపాల్‌లో బాంబు పేలుడుకు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
Fact:ఈ వాదన తప్పు. వైరల్ వీడియో 'తప్పుపించుకోలేరు' అనే సినిమాలో ఒక సీన్. ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి భోపాల్‌లో బాంబు పేలుడుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

Hyderabad: ఒక వ్యక్తి అరెస్ట్ అవుతున్నట్లు చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి భోపాల్‌లో పేలుడుకు కుట్ర పన్నినట్లు వాదనలతో ఈ వీడియోని పంచుకుంటున్నారు.

ఈ వీడియోలో సివిల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తుపాకీ గురిపెట్టి ఒక వ్యక్తిని పట్టుకున్నట్లు చూడవచ్చు. తర్వాత యూనిఫామ్‌లో ఉన్న అధికారులు ఆ వ్యక్తిని పోలీసు వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో వైరల్‌గా చూపిస్తుంది.

ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది ఆదిల్ కజ్మీ అని, సీబీఐ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు అయ్యాడని క్లెయిమ్ పేర్కొంది.

ఈ వీడియోను షేర్ చేస్తూ, ఒక ఫేస్‌బుక్ యూజర్ ఇలా అన్నారు, “ఇది భోపాల్‌లో పేలుడుకు కుట్ర పన్నిన ఆదిల్ కజ్మీ. సీబీఐ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ కారణంగా, అతన్ని ఇప్పటికే అరెస్టు చేశారు.” (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ వాదన తప్పు అని కనుగొంది. వైరల్ అవుతున్న వీడియో 'తప్పుపించుకోలేరు' అనే తెలుగు సినిమాలో ఒక దృశ్యం, ఇది నిజంగా జరిగిన ఘటన కాదు.

వీడియో ఎక్కడిది?

వీడియో కీఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫిబ్రవరి 12న తెలుగు ఫిల్మ్ ఛానల్ మాంగో వీడియోస్ ప్రచురించిన ఒక సినిమా దొరికింది. ఈ 10 నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో 3:38 నిమిషం మార్క్ వద్ద వైరల్ క్లిప్ కనిపిస్తుంది.

ఈ ఛానల్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ వీడియో 'తప్పించుకోలేరు' అనే తెలుగు హర్రర్ చిత్రంలో ఒక దృశ్యం. ఇందులో ఆదర్శ్, హరీష్ తెన్నేటి, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, అకెల్లా, ఫహీమ్ నటించారు. ఈ చిత్రానికి రుద్రపట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. RVG మూవీస్, SVL ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లపై రుద్రపట్ల వేణుగోపాల్ (RVG), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ చిత్రాన్ని నిర్మించారు.

వైరల్ క్లిప్ కల్పితం మాత్రమే, నిజమైన సంఘటన కాదని తేలింది.

హంగామా వెబ్‌సైట్ ప్రకారం, ఈ చిత్రం 2021 నాటిది. విషాదకరమైన భోపాల్ గ్యాస్ విపత్తును తిరిగి సృష్టించడానికి ఒక ఉగ్రవాది ప్రయత్నిస్తున్నట్లు, ఇద్దరు RAW ఏజెంట్లు దాడి చేయకుండా ఆ ఉగ్రవాదిని ఆపడానికి ఆపరేషన్ ప్లాన్ ఎలా ఆపుతారు అన్నదే కథ. ఈ చిత్రం గురించి ఇవే వివరాలను ప్రైమ్ వీడియో కూడా ధ్రువీకరించింది.

భోపాల్‌లో ఉగ్రవాద కుట్ర ?

భోపాల్‌లో ఉగ్రవాద కుట్రల గురించి ఎటువంటి వార్తలు లేనట్లు కనుగొన్నాం. ‘ఆదిల్ కజ్మీ’ అనే వ్యక్తి భోపాల్‌లో పేలుడుకు కుట్ర పన్నాడని లేదా అరెస్టు చేయబడ్డాడని విశ్వసనీయ మీడియా సంస్థల నుండి ఎటువంటి సమాచారం దొరకలేదు.

కాబట్టి, వైరల్ వీడియో భోపాల్‌లో జరిగిన నిజమైన అరెస్టు సంఘటనను చూపించడం లేదని తేలింది. న్యూస్‌మీటర్ వైరల్ వాదనలు తప్పు అని నిర్ధారించింది.

Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ వాదన తప్పు. వైరల్ వీడియో 'తప్పుపించుకోలేరు' అనే సినిమాలో ఒక సీన్. ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి భోపాల్‌లో బాంబు పేలుడుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
Next Story