తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, హైదరాబాద్ లో చెరువులు, నాళాలు ను పునరుద్ధరించడానికి, హైడ్రా (HYDRAA) అనే ఒక ఏజెన్సీని ప్రారంభించారు జరిగింది. ఎక్కడైతే ఈ నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నాయి, ఇలాంటి కట్టడాలు హైడ్రా బుల్ డోజర్లతో కూల్చివేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టు హైడ్రా చీఫ్, ఏ వీ రంగనాథ్ ను ఈ విషయమై ప్రశ్నించడం జరిగింది.
ఈ నేపధ్యం లో సామాజిక మాధ్యమాలలో ఒక 15 సెకన్ల వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక బుల్ డోజర్ పై దాడి చేయడం మనం చూడవచ్చు.
ఒక ఫేస్బుక్ వినియోగదారుడు, తన పోస్టులో, “హైడ్రా ను హడలెత్తిస్తున్న ప్రజలు.... ప్రజల్లో మార్పు మొదలయ్యింది.. ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరుముడే.. చిట్టీ నాయుడు ఊరుకుడే... ప్రజలు హైదరాబాద్ నుండి తరిమిటే... కొడంగల్.. కొడంగల్ నుండి ప్రజలు తరిమితే కొండారెడ్డిపల్లి.. పో.” ఇలాంటి.
ఇలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
Fact Check
కానీ వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కు సంబంధించినది కాదు.
వైరల్ వీడియో లో కీ ఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు ఇండియా టుడే వెబ్సైటు లో ప్రచురితమైన ఒక కథనం లభించింది. ఈ వీడియోను, సెప్టెంబర్ 22, 2024 నాడు షేర్ చేశారు. దీనికి వివరిస్తూ, అజ్మీర్ లో జరిగినటువంటి రెండు గ్రూపుల మధ్య తగాదాలు, ఒక మనిషి చనిపోయాడు, బుల్డోజర్ ధ్వంసం’ అంటూ రాసుకొచ్చారు.
ఇండియా టుడే కథనం లో, వైరల్ వీడియో మాదిరి వీడియో ని జత చేయడం జరిగింది, ఇక్కడ వీడియో లో కూడా కొంతమంది బుల్డోజర్ పై దాడి చేయడం మనం చూడవచ్చు. ఈ కథనం ప్రకారం, రాజస్థాన్ రాష్ట్రం లోని రూపన్‌గఢ్ అనే ప్రాంతం లో రెండు గ్రూపుల మధ్య ఒక భూ వివాదం గురించి గొడవ జరిగింది అని తెలిసింది.
ఇదే విషయం గురించి మరిన్ని వార్తా కథనాలు కూడా మాకు లభించాయి, న్యూస్24ఆన్లైన్ , ఆజ్ తక్ మరియు నమస్తే తెలంగాణ వార్తా కథనాలు కుడా అదే విధమైన వివరాలను సమకూర్చాయి. వీటి ప్రకారం, రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రూపన్‌గఢ్ ప్రాంతంలో జైన సమాజ్ గ్రూపునకు చెందిన స్థలంలో నిర్మాణంపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది అంటూ నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది. ఈ విషయం లో ఒక వర్గం ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించింది. పైగా, సర్పంచ్ ఆ భూమిని అక్రమంగా లీజుకు తీసుకున్నారని ఆరోపించింది. అయితే జైన సమాజ్ గ్రూపు యజమాని ఈ వివాదానికి దూరంగా ఉన్నాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్‌తోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు అని రాసుకొచ్చారు.
దీని ఆధారంగా, వైరల్ అవుతున్న వీడియో తప్పు దారి పట్టే విధంగా ఉంది అని మనం నిర్ధారించవచ్చు, ఎందుకంటే, ఈ వీడియో రాజస్థాన్ కు చెందినది కాబట్టి.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో హైడ్రా కి సంబంధించిన నిరసనలు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కి చెందినది కాదు, రాజస్థాన్ కి చెందినది