Fact Check: శంషాబాద్ హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మతపరమైన కోణం లేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు

By Newsmeter Network  Published on  14 Nov 2024 12:30 AM IST
Fact Check: శంషాబాద్ హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మతపరమైన కోణం లేదు.
Claim: మత విద్వేషాల కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
Fact: వైరల్ క్లెయిమ్ తప్పు. అరెస్టయిన వ్యక్తికి మానసిక సమస్యలు ఉన్నాయని, మత విద్వేషంతో ఈ ఘటన జరగలేదని శంషాబాద్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

Hyderabad: నవంబర్ 5, 2024 న, హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఐదు నవగ్రహ విగ్రహాలు ధ్వంసమైనట్లు అర్చకుడు కనుగొన్నారు. పూజ సమయంలో విధ్వంసం జరగడం గమనించిన పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనంగా, కొన్ని మితవాద సంస్థలు నిందితులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 6న బంద్‌ను ప్రకటించాయి.

అయితే కొందరు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో మతపరమైన కోణం ఉందని పేర్కొంటున్నారు.

X యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "एक मंदिर के बदले 2 मस्जिद तोड़ो, Shocking vandalism strikes again: Hindu temple in Shamshabad, Hyderabad, desecrated" అంటూ పోస్టు చేశారు. (Archive)



Fact check

ఈ వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుకొంది. అరెస్టయిన వ్యక్తికి మానసిక సమస్యలున్నాయని పోలీసులు తెలిపారు.

మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, ‘The Hindu' లో ప్రచురితమైన 'Man held for Vandalism at Shamshabad 's Hanuman temple', అనే ఒక కథనం లభించింది.


ఈ కథనం ప్రకారం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటనకు బాధ్యుడు ఒక 56 ఏళ్ల వ్యక్తి కోర్పాల్‌ అని గుర్తించారు. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని, అతని పుట్టుపూర్వోత్తరాల గురించి సరైన వివరాలు చెప్పలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.

మరో మీడియా సంస్థ Latestly కుడా ఇదే విషయాన్ని ‘Hyderabad Hanuman Temple Vandalism: 50- year- old UP Man arrested after idols of Navagraha damaged in shamshabad (Watch Video)’, అనే శీర్షికతో 2024 నవంబర్ 5న, ప్రచురించింది .


ఆ నివేదిక ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ఒక వయోవృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు. అతనిని ఉత్తరప్రదేశ్‌లోని సిర్పురా జిల్లా దాన్సింగ్ పూర్ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతను శ్రీపుత్రీ లాల్ గణపతి సింగ్ అనే వ్యక్తి కుమారుడు అని Latestly నివేదికలో కూడా పేర్కొన్నారు.

NewsMeter శంషాబాద్ ఏసీపీ కే శ్రీనివాస్ రావుతో ఫోన్‌లో మాట్లాడగా, కోర్పాల్‌కి మానసిక సమస్యలు ఉన్నాయని, దాంతోపాటు ఈ సంఘటన వెనుక మతపరమైన కారణాలు లేవని ఆయన చెప్పారు.ఈ విషయంపై NewsMeter ఎక్కడ కూడా సంఘటనకు మతపరమైన కోణం ఉన్నట్లు గుర్తించలేదు.

కాబట్టి, శంషాబాద్ నవగ్రహ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మతపరమైన కోణాన్ని సూచించే వాదన నిరాధారమైనదని మేము నిర్దరించాము.

Claim Review:మత విద్వేషాల కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్ తప్పు. అరెస్టయిన వ్యక్తికి మానసిక సమస్యలు ఉన్నాయని, మత విద్వేషంతో ఈ ఘటన జరగలేదని శంషాబాద్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Next Story