Fact Check : నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వచ్చిన వార్త నిజం కాదు.

కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

By Sridhar  Published on  19 April 2024 7:33 AM GMT
Power cut in Nampally court in Telangana, Wednesday afternoon power cut in Nampally court
Claim: బుధవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుండగా కరెంటు కోత.. చీకటిలోనే వాదనలు విన్న జడ్జి.
Fact: కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలో ఇటీవల పెరుగుతున్న విద్యుత్ కోతలతో ప్రజలు సహనం కూలిపోయి, అప్రకటిత విద్యుత్ కోతలపై సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులను ప్రశ్నిస్తూ, అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇప్పటిలాగా విద్యుత్ కోతలను చూడలేదని ప్రజలు పేర్కుంటున్నట్లు వార్త నివేదికలు తెలుపుతున్నాయి.

అయితే ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనుల కారణంగానే కరెంటు కోతలు ఏర్పడినట్లు, రాష్ట్రంలో కరెంటు కొరత ఏమాత్రం కూడా లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, బుధవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుండగా కరెంటు కోత.. చీకటిలోనే వాదనలు విన్న జడ్జి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ
ఈ వాదనలో నిజానిజాలు తెలుసుకుందాం రండి.

నిజ నిర్ధారణ :

నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వచ్చిన వార్త అవాస్తవమని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము 'నాంపల్లి కోర్టులో పవర్ కట్' అనే కీవర్డ్‌లను ఉపయోగించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ [TSSPDCL] అధికారిక హ్యాండిల్ ద్వారా X పై ఓ పోస్ట్‌ని కనుగొన్నాము.

బుధవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వైరల్‌ అయ్యిన వార్తలు ఫేక్, మరియు కన్ఫర్మ్ చేయని వార్త అని పోస్ట్‌లో పేర్కొంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ

అదే విధంగా, నాంపల్లి కోర్టులో పైన పేర్కొన్న అంతరాయం కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా జరిగింది మరియు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నుండి విద్యుత్ సరఫరా సమస్య కారణంగా కాదని.
మొదట, కోర్టులో కరెంటు కోత అంటూ వైరల్ చిత్రాన్ని పోస్ట్ చేసిన న్యాయవాది శ్రీ విజయ్ గోపాల్ కూడా ఇది అంతర్గత సమస్య అని ధృవీకరించారు అని.


ఇదే పోస్ట్‌లో, ఇది అంతర్గత సమస్య అని కోర్టు ఎలక్ట్రీషియన్‌లు ధృవీకరించిన వీడియోను కూడా జోడించారు.

చివరగా ఆ ప్రాంతంలో లేదా చుట్టుపక్కల ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని నిర్ధారించారు.

మేము మరింత శోధిస్తున్నప్పుడు, SE ఆపరేషన్ హైదరాబాద్ సెంట్రల్ యొక్క అధికారిక హ్యాండిల్ ద్వారా కూడా X పై ఒక పోస్ట్‌ను కనుగొన్నాము, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని మరియు అంతర్గత MCB ట్రిప్ కారణంగా సమస్య ఏర్పడిందని పోస్ట్‌లో పేర్కొంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ

'తెలంగాణలో విద్యుత్ పరిస్థితి పై దుష్ప్రచారం పెరిగిపోవడంతో, అనవసరమైన విద్యుత్ కోతలకు సంబంధించిన సందర్భాలు నివేదించి నట్లయితే, ఇంధన శాఖ సిబ్బంది మరియు అధికారుల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా ఇంధన వనరులు రాష్ట్రంలో ఉన్నాయి మరియు ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ కోతలను ప్రకటించలేదు. వాస్తవంగా గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరాలో పెరుగుదల ఉంది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.' అని ఒక వార్తా కథనం పేర్కొంది.
అందుకే, బుధవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వచ్చిన వార్త అవాస్తవమని మేము నిర్ధారించాము.
Claim Review:There was a power cut at Nampally court on Wednesday afternoon during the cross-examination.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Fact:కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
Next Story