Fact Check: మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో చైన్ స్నాచింగ్ చేసి మహిళను తీవ్రంగా గాయపరిచారా? కాదు, అసలు విషయం ఇదే

మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో నేలపై పడిపోయిన మహిళ వీడియో సోషల్ మీడియాలో చైన్ స్నాచింగ్ ఘటనగా వైరల్ అవుతోంది.

By -  M Ramesh Naik
Published on : 12 Feb 2026 9:20 PM IST

A video of a woman lying on the floor at Madurai Periyar Bus Stand is going viral with claims of a chain-snatching attack.
Claim:మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో ఓ మహిళ గొలుసు లాక్కోవడంతో ఆమె మెడకు తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం జరిగింది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్న మహిళ గొలుసు దొంగతనం బాధితురాలు కాదు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళా అని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం ఆమెను సురక్షితంగా ఆమె చెల్లికి అప్పగించారు.

హైదరాబాద్: తమిళనాడులోని మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో నేలపై పడిపోయిన ఓ మహిళకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చైన్ స్నాచింగ్ ఘటనగా ప్రచారం చేస్తూ, దొంగ గొలుసు లాగడంతో మహిళ తీవ్రంగా గాయపడిందని పోస్టులు చేస్తున్నారు.

ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, చైన్ స్నాచింగ్ కారణంగా మహిళ తీవ్రంగా గాయపడిందని, అక్కడ ఉన్నవారు సహాయం చేయలేదని పేర్కొన్నారు. (ఆర్కైవ్)

ఇలాంటి పోస్టులు మరికొన్ని ఇక్కడ, ఇక్కడ చూడొచు.(ఆర్కైవ్1, ఆర్కైవ్2)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ వీడియోలో గొలుసు దొంగతనం ఘటన ఏదీ జరగలేదు. వీడియోలో కనిపిస్తున్న మహిళ మానసిక అస్వస్థతతో బాధపడుతున్నారు.

వీడియో ఎక్కడ చిత్రీకరించబడింది?

ఈ వీడియో తమిళనాడులోని మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో చిత్రీకరించబడింది. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని న్యూస్‌మీటర్ కీవర్డ్ సెర్చ్ చేయగా, మదురై సిటీ పోలీసులు X (ట్విట్టర్)లో విడుదల చేసిన అధికారిక వివరణ లభించింది.

పోలీసులు ఏమన్నారు?

పోలీసుల ప్రకారం, థిదిర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ బస్ స్టాండ్‌లో బట్టల వ్యాపారిణితో వాగ్వాదానికి దిగింది. అది కాస్త గొడవగా మారింది. ఈ సమయంలో ఆమె మరో మహిళ మెడలో ఉన్న తాళిస్మాన్‌ను లాగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలు ఆమెను తోసేయడంతో ఆమె కిందపడింది.

పోలీసుల విచారణలో ఆమె మదురైలోని కొచ్చడై ప్రాంతానికి చెందిన మహిళ అని తెలిసింది. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నట్లు, తరచూ ఇంటి నుంచి వెళ్లిపోవడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆమెను సురక్షితంగా ఆమె చెల్లి, భర్తకు అప్పగించి వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు.

ఈ ఘటనను చైన్ స్నాచింగ్ లేదా మహిళలపై దాడిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పూర్తిగా తప్పు అని పోలీసులు స్పష్టం చేశారు.

మదురై పెరియార్ బస్ స్టాండ్‌లో మహిళ చైన్ స్నాచింగ్ చేసి తీవ్రంగా గాయపరిచారని వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్నది గొలుసు దొంగతనం ఘటన కాదు; మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళకు సంబంధించిన సంఘటన మాత్రమే.

Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, Instagram
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్న మహిళ గొలుసు దొంగతనం బాధితురాలు కాదు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళా అని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం ఆమెను సురక్షితంగా ఆమె చెల్లికి అప్పగించారు.
Next Story