Fact Check: బంగ్లాదేశ్ అటవీ శాఖ కొత్త యూనిఫాంనా? కాదు, వైరల్ ఫోటో AI మానిప్యులేషన్

పులి చారల షర్ట్, పాము చర్మం డిజైన్ ఉన్న ప్యాంట్‌లతో కనిపిస్తున్న ఫోటోను బంగ్లాదేశ్ అటవీ శాఖ కొత్త యూనిఫాం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

By -  M Ramesh Naik
Published on : 27 April 2026 10:26 AM IST

An image showing animal print uniforms is going viral with the claim that it shows the new uniforms of the Bangladesh Forest Department.
Claim:బంగ్లాదేశ్ అటవీ శాఖకు కొత్త యూనిఫాంగా పులి చారల షర్ట్, పాము చర్మం డిజైన్ ఉన్న ప్యాంట్లు ప్రవేశపెట్టారు.
Fact:తప్పు. ఇది బంగ్లాదేశ్ పోలీసుల కొత్త యూనిఫాం ఫోటోను AI సహాయంతో మార్చి రూపొందించిన చిత్రం.

హైదరాబాద్: జంతువుల చర్మాల డిజైన్‌లతో ఉన్న దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బంగ్లాదేశ్ అటవీ శాఖ కొత్త యూనిఫాం అని సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ, మీమ్స్ కూడా తయారు చేస్తున్నారు.

వైరల్ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు పులి చారలున్న షర్ట్, పాము చర్మం మాదిరిగా కనిపించే ప్యాంట్లు ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే వారికి ఐడీ కార్డులు, బ్యాడ్జీలు, నేమ్ ప్లేట్లు, లోగో ఉన్న బెల్ట్ కూడా కనిపిస్తున్నాయి.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, ఫోటోపై “బంగ్లాదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొత్త యూనిఫాం” అని టెక్స్ట్ ఉంది. (Archive)

Fact Check

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ ఫోటో అసలు బంగ్లాదేశ్ పోలీసుల కొత్త యూనిఫాం ఫోటోను AI సహాయంతో మార్చి రూపొందించారు.

ఫోటో అసలు ఎక్కడిది?

వైరల్ ఫోటో నిజంగా బంగ్లాదేశ్ అటవీ శాఖ కొత్త యూనిఫాం అని చెప్పే ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు కనిపించలేదు.

కీవర్డ్ సెర్చ్ చేయగా, ఏప్రిల్ 21న ప్రచురితమైన ది డైలీ ఒబ్సెర్వెర్ కథనం కనిపించింది. 'అధికారులలో అసంతృప్తి నేపథ్యంలో పోలీసు యూనిఫాంలో మార్పులకు ప్రభుత్వం ప్రణాళిక' అనే శీర్షికతో వచ్చిన ఈ కథనంలో వైరల్ ఫోటోలో కనిపిస్తున్న అదే ఇద్దరు అధికారులు ఉన్న ఫోటో ఉంది.

అయితే అసలు ఫోటోలో వారు టీల్, బ్లూ, ఖాకీ రంగుల యూనిఫాం ధరించి ఉన్నారు.

అదే ఫోటోను ది బిజినెస్ స్టాండర్డ్ కూడా ఏప్రిల్ 21న ప్రచురించింది. అందులో “పోలీసులచే కొత్త యూనిఫాం ప్రతిపాదన” అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ ఫోటోను డైలీ సన్, టైమ్స్ ఆఫ్ బంగ్లాదేశ్, కలేర్ కాంతో, బోనిక్ బార్తా, ప్రతిదిన్, క్యాంపస్ టైమ్స్ వంటి పలు మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.

AIతో మార్చారా?

అసలు ఫోటో అనేక వార్తా సంస్థల్లో ఒకే విధంగా కనిపించడంతో వైరల్ ఫోటోను AIతో మార్చి ఉండొచ్చని అనుమానం వచ్చింది.

దీన్ని నిర్ధారించేందుకు Sight Engine అనే AI డిటెక్షన్ టూల్‌తో పరీక్షించగా, ఈ ఫోటో 94 శాతం వరకు డీప్‌ఫేక్ అయ్యే అవకాశముందని తేలింది.

అలాగే Google DeepMind యొక్క SynthID డిటెక్టర్‌తో పరిశీలించగా, ఈ చిత్రం Google AI టూల్స్ ఉపయోగించి రూపొందించినట్లు గుర్తించింది.

దీనితో బంగ్లాదేశ్ పోలీసుల అసలు యూనిఫాం ఫోటోను AI సహాయంతో మార్చి వైరల్ చేశారని స్పష్టమైంది.

కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.

Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:తప్పు. ఇది బంగ్లాదేశ్ పోలీసుల కొత్త యూనిఫాం ఫోటోను AI సహాయంతో మార్చి రూపొందించిన చిత్రం.
Next Story