నిజమెంత: టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయలేదు.

మే 13న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. అయితే టైమ్స్ నౌ వార్తా ఛానెల్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిందంటూ.. ఓ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By Newsmeter Network  Published on  16 May 2024 2:56 PM GMT
నిజమెంత: టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయలేదు.

మే 13న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. అయితే టైమ్స్ నౌ వార్తా ఛానెల్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిందంటూ.. ఓ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఆ స్క్రీన్ షాట్ లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 95-100 సీట్లు, జనసేన పార్టీ (జేఎస్పీ) 16-18 సీట్లు, బీజేపీకి 3-5 సీట్లు, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి 55-60 సీట్లు వస్తాయని స్క్రీన్‌షాట్‌లోని డేటా పేర్కొంది.
“It’s not Sakshi or tv9. It's times now channel, Andhra Pradesh exit poll. #Andhrapardeshelection2024 #AllianceSweepingAP #AllianceForABetterFuture #NDAallianceWinning #PawanakalyanWinningPithapuram #Pithapuram #pawankalyan. (sic)” అంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. సాక్షి, టీవీ9 ఛానల్స్ కు సంబంధించిన డేటా కాదని అందులో చెప్పడం మనం చూడొచ్చు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించడాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధించింది.
మేము టైమ్స్ నౌ మీడియా సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ (X, Facebook, Instagram), టైమ్స్ నౌ వెబ్‌సైట్‌ను పరిశీలించాము. ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు.
మేము ఎగ్జిట్ పోల్‌స్ కు సంబంధించి ECI మార్గదర్శకాలనీ పరిశీలించాం. అంతేకాకుండా మార్చి 2024 నుండి ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా నివేదికలను కూడా చూశాము. ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నిషేధమని ఎన్నికల కమీషన్ ఆంక్షలు ఇప్పటికే విధించింది. ఏప్రిల్ 19-జూన్ 1 సాయంత్రం 6.30 గంటలకు లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించారు.
ఏప్రిల్ 2, 2024న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల మీడియా కవరేజీకి సంబంధించి ECI కు సంబంధించిన ఒక ప్రెస్ నోట్‌ని కూడా మేము చూశాము.
"According to Section 126A of the RP Act 1951, the conduct of exit polls and the dissemination of their results are prohibited from the commencement of polling hours on the first day of polling (Phase 1) until half an hour after the close of polling in all states and Union territories (Phase 7)" అంటూ కీలక సూచన చేశారు. RP చట్టం 1951లోని సెక్షన్ 126A ప్రకారం, పోలింగ్ ప్రారంభమైన మొదటి రోజు (ఫేజ్ 1) పోలింగ్ గంటల ప్రారంభం నుండి పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, వాటి ఫలితాలను ప్రసారం చేయడం నిషేధించారు.

ECI అధికారిక X హ్యాండిల్ కు సంబంధించి ఏప్రిల్ 19న పెట్టిన ఒక పోస్ట్‌లో.. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రచురించడం నిషేధించినట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 15న, NewsMeter ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వైరల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ ఫలితాలని ప్రచురించింది. NDA కూటమి, YSRCP మద్దతుదారులు తమ పార్టీలకే మెజారిటీ వస్తుందని కొన్ని మీడియా సంస్థలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో చెప్పుకొచ్చారు. అయితే ది న్యూస్ మినిట్ ఎడిటర్-ఇన్-చీఫ్ ధన్య రాజేంద్రన్ తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్‌ను ప్రచురించలేదని ఖండించారు.
అందువల్ల, టైమ్స్ నౌ పేరును ఉపయోగించి చేస్తున్న వైరల్ ఎగ్జిట్ పోల్ గ్రాఫిక్స్ కార్డు నకిలీదని మేము నిర్ధారించాము. ఛానెల్ అటువంటి పోల్ ఫలితాలను ప్రచురించలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim Review:టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయలేదు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story