Fact Check: ఈవీఎం స్కాంలో ఏపీ బడా నేత పాత్ర ఉందన్న టీఎంసీ ఎంపీ? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

టీఎంసీ ఎంపీ సయాని ఘోష్ శాసనసభలో మాట్లాడుతూ, 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలో ఈవీఎం స్కాం జరిగిందని, అందులో ఒక బడా నేత ప్రధాన పాత్ర పోషించారని వ్యాఖ్యలు చేశారనే క్లెయిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By K Sherly Sharon
Published on : 14 Aug 2025 9:28 AM IST

Fact Check: ఈవీఎం స్కాంలో ఏపీ బడా నేత పాత్ర ఉందన్న టీఎంసీ ఎంపీ? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ సయాని ఘోష్ మాట్లాడుతూ, 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలో ఈవీఎం స్కాం జరిగిందని, అందులో ఒక ప్రజాప్రతినిధి ప్రధాన పాత్ర ఉందని అన్నారు.
Fact:ఈ క్లెయిమ్‌లో నిజం లేదు. టీఎంసీ నేత సయోనీ ఘోష్ జూలై 29, 2025న శాసనసభలో చేసిన ఈ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు.

Hyderabad: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) శాసనసభ సభ్యురాలు సయోనీ ఘోష్ 2024 లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారనే క్లెయిమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీఎంసీ నేత ఘోష్ శాసనసభలో మాట్లాడుతున్న ఒక వీడియోని షేర్ చేసి ఈ ఆరోపణలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో సయోనీ ఘోష్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ అధికార బీజేపీ, ప్రధాని మోడీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా పేర్కొన్నారు, "2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సయాని గోష్ సంచలన వ్యాఖ్యలు ! 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో EVM స్కాం జరిగింది... ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి EVM స్కాంకు ప్రధాన కారకుడు... దులిపేసిందిగా మోడీ గారు ఏమి సమాధానం చెప్పుతారో #APElections2024 #EVMScam" (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. టీఎంసీ నేత సయోనీ ఘోష్ జూలై 29, 2025న శాసనసభలో చేసిన ఈ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు.

టీఎంసీ ఎంపీ సయోనీ ఘోష్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని చూపిస్తున్న వార్త నివేదికలు, సోషల్ మీడియా పోస్టుల ఏవి దొరకలేదు.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూలై 29న లైవ్ హిందూస్తాన్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియో శీర్షిక, "సయాని ఘోష్ లోక్‌సభ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్‌పై మాట్లాడుతూ మమతా ఎంపీ బలమైన ప్రసంగం చేశారు."

వైరల్ వీడియోలో ఈ ప్రసంగంలో నుండి తీసుకోబడ్డ వీడియో క్లిప్పులను ఉపయోగించారని తెలుస్తోంది. ఈ ప్రసంగం అదే రోజు ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన చర్చలోదిగా యూట్యూబ్ వీడియో సారాంశంలో పేర్కొన్నారు.

జూలై 29న శాసనసభలో జరిగిన చర్చల పూర్తి వీడియో ది ప్రింట్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఈ వీడియోలో 4:13:00 గంటల మార్కు వద్ద సయాని ఘోష్ మాట్లాడడం ప్రారంభించారు. వీడియోలో 4:29:25 గంటల మార్కు వరకు ఘోష్ ప్రసంగం సాగింది. అంటే 16 నిమిషాల కంటే కొంచం ఎక్కువ సమయం తీసుకున్నారు.

ఈ 16 నిమిషాల నివిడిలో కానీ, మరి ఆ రోజు శాసనసభలో జరిగిన మొత్తం చర్చలో కానీ టీఎంసీ ఎంపీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో ఈవీఎం స్కాం జరిగింది అని అన్నట్లు కనిపించడం లేదు.

ఏపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి ఈవీఎం స్కాంకు ప్రధాన కారకుడని సాయని ఘోష్ శాసనసభలో అన్నారని వైరల్ అవుతున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ సయాని ఘోష్ మాట్లాడుతూ, 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలో ఈవీఎం స్కాం జరిగిందని, అందులో ఒక ప్రజాప్రతినిధి ప్రధాన పాత్ర ఉందని అన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్‌లో నిజం లేదు. టీఎంసీ నేత సయోనీ ఘోష్ జూలై 29, 2025న శాసనసభలో చేసిన ఈ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు.
Next Story