Fact Check: ఇజ్రాయెల్‌కు ఆయుధాలు తీసుకెళ్లడానికి నిరాకరించినందుకు అబ్దుల్, సల్మా అనే అమెరికన్ సైనిక పైలట్ల అరెస్టు? లేదు నిజం ఇక్కడ తెలుసుకోండి
ఇజ్రాయెల్‌కు ఆయుధాలు తీసుకెళ్లే విమానాలను నడపడానికి నిరాకరించినందుకు ఇద్దరు అమెరికన్ ముస్లిం సైనిక పైలట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
By - K Sherly Sharon |
Claim:ఇజ్రాయెల్‌కు ఆయుధాలు తీసుకెళ్లే విమానాలను నడపడానికి నిరాకరించినందుకు ఇద్దరు అమెరికన్ ముస్లిం సైనిక పైలట్లను అరెస్టు చేశారు. వీరి పేర్లు అబ్దుల్, సల్మా.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. సెనేట్ విచారణకు అంతరాయం కలిగించినందుకు ఇద్దరు అమెరికన్ సైనిక వెటరన్స్‌ని అరెస్టు చేసినట్లు వీడియో చూపిస్తుంది. వీరు పేర్లు ఆంటనీ అగ్విలార్, జోసఫిన్ గ్విల్బో.
Hyderabad: ఇజ్రాయెల్, గాజా మధ్య వివాదం తీవ్రమవుతోంది, ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో తన సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. ఈ సందర్భంలో, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు నిండిన విమానాలను నడపడానికి నిరాకరించిన ఇద్దరు అమెరికన్ సైనిక పైలట్‌లు, అబ్దుల్, సల్మాలను అరెస్టు చేశారనే క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో, ఇద్దరు యూనిఫాం ధరించిన అధికారులను, తరువాత మరొక వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు చూడవచ్చు. 'అమెరికా మారణహోమంలో భాగస్వామి' అని చెబుతూ ముగ్గురూ నినాదాలు చేస్తూ, నిరసన తెలుపుతున్నట్లు కనిపిస్తుంది.
"లౌకికవాదం కింద అబ్దుల్ మరియు సల్మాను సైన్యంలోకి నియమించుకున్న అమెరికా వైమానిక దళం, వారు సకాలంలో తమ జిహాదీ పరిమితులకు చేరుకున్నారు.. అబ్దుల్ మరియు సల్మా ఇజ్రాయెల్‌కు సాయుధ నౌకను తీసుకెళ్లడానికి నిరాకరించారు - పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు" అనే క్యాప్షన్‌తో, ఈ వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడింది. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
వైరల్ నిజం కాదని న్యూస్‌మీటర్ కనుగొంది. సెప్టెంబర్ 3న సెనేట్ విచారణకు అంతరాయం కలిగించినందుకు ఇద్దరు మాజీ సైనికులని, మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సైనిక అధికారుల పేర్లు ఆంటనీ అగ్విలార్, జోసఫిన్ గ్విల్బో.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి, వైరల్ వీడియోను సెప్టెంబర్ 4న ‘వివా వివా పాలస్తీనా’ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు కనుగొన్నాం. క్యాప్షన్‌లో అమెరికా మాజీ సైనికులు ఆంథనీ అగ్విలార్, జోసఫిన్ గ్విల్బో గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న మారణహోమంలో సెనెట్ కమిటీ సభ్యులు భాగస్వాములని విమర్శించడంతో వారిని సెనేట్ విచారణ నుంచి బయటకు పంపించారని పేర్కొంది.
“గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) కోసం కాంట్రాక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ గ్రీన్ బరెట్ అయిన అగ్విలార్, ఆహారం కోసం GHF ‘సహాయ’ కేంద్రాలకు వచ్చిన పాలస్తీనా పౌరులపై కాల్పులు జరిపినందుకు ఆ సంస్థను తప్పుపట్టాడు.”
ఈ లీడ్ అనుసరించి కీవర్డ్ సెర్చ్‌లు నిర్వహించాము, సెప్టెంబర్ 3న 'అల్ జజీరా ఇంగ్లీష్' ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వైరల్ వీడియోను కనుగొన్నాం. వీడియోలో సెనేట్ విచారణలో యూనిఫాం ధరించిన ఇద్దరు అధికారులు గట్టిగా నిరసన వ్యక్తం చేయడం, వారిని బయటకు లాగిన దృశ్యాలను కూడా చూడవచ్చు.
వీడియో శీర్షికలో ఇలా రాశారు, “గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా మద్దతును ఖండిస్తూ సెనేట్ విచారణకు అంతరాయం కలిగించిన యుఎస్ ఆర్మీ వెటరన్స్ ఆంథోనీ అగ్యిలార్, జోసెఫిన్ గిల్‌బ్యూను వీడియో చూపిస్తుంది. ఇద్దరినీ అరెస్టు చేసి, తరువాత విడుదల చేసినట్లు సమాచారం.”
అదే రోజు ప్రచురించిన TRT వరల్డ్ నివేదిక ప్రకారం, చట్టసభ్యులు నరహత్యలో భాగస్వాములని ఆరోపిస్తూ విచారణను అడ్డుకోవడంతో ఆంథనీ అగ్విలార్‌ను సెనేట్ విచారణ నుంచి బలవంతంగా బయటకు పంపించారని పేర్కొంది.
“వాషింగ్టన్, డీసీలో జరిగిన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ నిర్ధారణ విచారణ సందర్భంగా, మాజీ గ్రీన్ బరెట్ లెఫ్టినెంట్ కర్నల్ ఆంథనీ అగ్విలార్ మరియు మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ జోసఫిన్ గ్విల్బో లేచి నిలబడి, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడటం తమ రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని ప్రకటించారు,” అని నివేదిక తెలిపింది.
అదే రోజు ప్రచురించిన TRT వరల్డ్ కథనం ప్రకారం, చట్టసభ్యులు నరహత్యలో భాగస్వాములని ఆరోపిస్తూ విచారణను అడ్డుకోవడంతో ఆంథనీ అగ్విలార్‌ను సెనేట్ విచారణ నుంచి బలవంతంగా బయటకు పంపించారని పేర్కొంది.
“వాషింగ్టన్, డీసీలో జరిగిన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ నిర్ధారణ విచారణ సందర్భంగా, మాజీ గ్రీన్ బరెట్ లెఫ్టినెంట్ కర్నల్ ఆంథనీ అగ్విలార్ మరియు మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ జోసఫిన్ గ్విల్బో లేచి నిలబడి, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడటం తమ రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని ప్రకటించారు,” అని కథనం పేర్కొంది.
సహాయ కార్యకలాపాల సమయంలో పౌరులును, ఆకలితో ఉన్న ఒక బాలుడు, అమీర్, చంపబడటం గురించి అగ్విలార్ మాట్లాడినట్లు ఈ కథనం వివరిస్తుంది. అమెరికా మద్దతు ఉన్న కాంట్రాక్టర్లు ఈ దారుణాలకు సహకరిస్తున్నారని ఆరోపించినట్లు పేర్కొంది.
ఆంథనీ అగ్విలార్, జోసఫిన్ గ్విల్బో ఇజ్రాయెల్‌కు ఆయుధాలు మోసే విమానాలను నడపడానికి నిరాకరించినందుకు అరెస్టు అయ్యారని చెప్పిన నివేదికలు ఎక్కడా లేవు.
అయితే సల్మా, అబ్దుల్ అనే అమెరికన్ ముస్లిం సైనిక పైలెట్స్ ఇస్రాయెల్స్ ఆయుధాలు తీసుకెళ్లే విమానాలను నడపడానికి నిరాకరించినందుకు అరెస్ట్ చేయబడినట్లు పేర్కొంటున్నక్లెయిమ్‌లో నిజం లేదు. ఆ అధికారులు అమెరికన్ మాజీ సైనికులు. వారి పేర్లు ఆంథనీ అగ్విలార్, జోసఫిన్ గ్విల్బో. సెప్టెంబర్ 3న సెనేట్ విచారణను అడ్డుకోవడం వల్ల వారిద్దరిని అరెస్టు చేశారు.
వైరల్ క్లెయిమ్‌లు అవాస్తవమని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.