Fact Check: అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్న వీడియో? లేదు, ఇది ఏఐ ద్వారా రూపొందించబడింది

అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 20 Jun 2025 4:58 PM IST

Fact Check: అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్న వీడియో? లేదు, ఇది ఏఐ ద్వారా రూపొందించబడింది
Claim:అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.

Hyderabad: అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ A171), జూన్ 12న, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాదం 240 మందికి పైగా ప్రాణాలను బలిగొంది, దేశవ్యాప్తంగా దుఃఖాన్ని నింపింది.

ఈ నేపథ్యంలో, విమానం కూలిపోయిన దృశ్యాలను స్పష్టంగా చూపిస్తున్న దృశ్యాలు అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఇలా రాసి ఉంది - 'విమానం ఎలా కూలిందొ క్లారిటీగా ఈ వీడియోలో చూడండి'.

ఈ వీడియోని ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాశారు, "విమానం ఎలా కూలిందో క్లారిటీ వీడియో." (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియో ఏఐతో రూపొందించబడింది.

కీ వర్డ్ సెర్చ్ ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని వీడియో తీసిన ఆర్యన్ అన్సారీ గురించి తెలిసింది. 17 ఏళ్ళ ఆర్యన్ తన ఇంటికి అతి సమీపంగా విమానం వెళ్తున్నందున, స్నేహితులకు చూపించడానికి వీడియో ఎయిర్ ఇండియా విమానాన్ని తీసాడు. అయితే, విమానం కొంచం దూరంలోనే కూలిపోయింది.

ఆర్యన్ ఆన్సర్ తీసిన ఈ వీడియోని, NDTV కూడా యూట్యూబ్‌లో జూన్ 12న షేర్ చేసింది.

వైరల్ వీడియోలో దృశ్యాలు కొంతమటుకు ఈ వీడియోతో కలిసినా, అందులో చాల అసమానతలు ఉన్నట్లు గుర్తించాం. ఆర్యన్ తీసిన వీడియోలో ఎయిర్ ఇండియా ప్లేన్ వెనుక భాగంలో, వర్టికల్ స్టెబిలైజర్‌పై నారింజ రంగు ఉంది, ఇది ప్లేన్ వెనుక భాగంలో కొంత ఉన్నట్లు కనిపిస్తుంది. వైరల్ వీడియోలో ఈ రంగు వర్టికల్ స్టెబిలైజర్‌పై మాత్రమే ఉంది, ప్లేన్ బాడీ మీద లేదు.

అలాగే, విమానం గాల్లో ఉండగానే, ముందు భాగంలో పేలుడు జరిగినట్లు వీడియోలో ఒక ఫ్రేములో కనిపిస్తుంది. అలంటి పేలుడు ఏది జరగలేదని ఆర్యన్ తీసిన వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోలో ఏఐ ద్వారా రూపొందించబడ్డ వీడియోల్లో ఉన్నట్లు అసహజమైన లైటింగ్ ఉంది. ఈ వీడియోని ఏఐ సాయంతో తయారు చేసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ద్రువీకరించడానికి డీప్ ఫేక్ ఓ మీటర్ ఉపయోగించాము.

వీడియో కచ్చితంగా ఏఐచే రూపొందించబడిందని ఈ టూల్ తేల్చేసింది.

కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. ఈ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.

Claim Review:అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.
Next Story