Hyderabad: పశ్చిమ బెంగాల్‌లో బాలికల పరిస్థితిని చూపిస్తున్న వీడియో అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, స్కూల్ యూనిఫార్మ్ ధరించిన అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొట్టినట్లు కనిపిస్తుంది. వైరల్ వీడియోలో ఉన్నది 'లవ్ జిహాద్ కొత్త రూపం' అనే దావా కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ""నువ్వు నా సోదరుడితో వెళ్లి అతనితో ఏకాంతంగా ప్రేమగా వ్యవహరించాలి" లవ్ జిహాద్ యొక్క కొత్త రూపం. పశ్చిమ బెంగాల్ బాలికల పరిస్థితి" అని రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించినది కాదు బంగ్లాదేశ్ నుండి వచ్చింది.
వీడియో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఫేస్‌బుక్‌లో జూలై 4న అప్లోడ్ చేయబడ్డ వైరల్ వీడియో దొరికింది. ఈ వీడియో క్యాప్షన్‌లో "దేశంలోని ప్రతిభావంతులైన వాళ్ళు ఇప్పుడు తమ బాయ్‌ఫ్రెండ్‌ల కోసం పోరాడుతున్నారు, అందుకే ఒక కిలో బియ్యం 80 టాకాలు అయ్యింది," అని రాశారు.
দেশের হোগো মেরে মেধাবীরা এখন বয়ফ্রেন্ড নিয়ে মারামারি করে এরজন্যই চালের কেজি ৮০ টাকা।
Posted by B-71 on Friday, July 4, 2025
టాకా అనేది బంగ్లాదేశ్‌లో ఉపయోగించే కరెన్సీ.
ఇవే క్లెయిమ్‌లను ప్రస్తావిస్తూ పశ్చిమ బెంగాల్ పోలీసులు Xలో పోస్ట్ చేశారు. పోస్టులో, "పాఠశాల యూనిఫాం, బ్యాచ్, నిర్మాణంతో సహా దృశ్య ఆధారాలు ఈ వీడియో బంగ్లాదేశ్ నుండి వచ్చిందని, ముఖ్యంగా షాహిద్ ముక్తిజోద్ధ గర్ల్స్ హై స్కూల్, సెక్షన్-12, బ్లాక్-డి, రోడ్- 18, పల్లాబి, మీర్పూర్, ఢాకా-1216 నుండి వచ్చిందని సూచిస్తున్నాయి," అని రాశారు.
వైరల్ వీడియోలో జరిగిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరగలేదు, ఇది బంగ్లాదేశ్‌కు సంబంధించిన వీడియో.
కాబట్టి న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.