Fact Check: సౌదీ అరేబియాకు సంబంధించిన విజువల్స్ ను ఖమ్మం ఘటనకు సంబంధించినవిగా ప్రచారం

కాలనీల్లోకి వరద నీరు పొంగిపొర్లడంతో తెలంగాణలోని ఖమ్మం పట్టణం వరదల బారిన పడింది.

By Newsmeter Network  Published on  5 Sept 2024 4:47 PM IST
Fact Check: సౌదీ అరేబియాకు సంబంధించిన విజువల్స్ ను ఖమ్మం ఘటనకు సంబంధించినవిగా ప్రచారం
Claim: ఖమ్మంలో 9 మంది ప్రాణాలను కాపాడిన JCB డ్రైవర్ కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇది.
Fact: వైరల్ వీడియో ఈ ఏడాది ప్రారంభంలో బిషా వరదల సమయంలో సౌదీ అరేబియాకు సంబంధించింది. ఈ వీడియోతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు.

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో తీవ్ర వరదలు సంభవించాయి. చాలా ప్రాంతాలలోని ప్రజలు అల్లాడిపోతున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వందలాది గ్రామాలు నీట మునగడంతో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


కాలనీల్లోకి వరద నీరు పొంగిపొర్లడంతో తెలంగాణలోని ఖమ్మం పట్టణం వరదల బారిన పడింది. వార్తా నివేదికల ప్రకారం, ప్రకాష్ నగర్‌లోని పొంగిపొర్లుతున్న మున్నేరు నది మీద నిర్మించిన వంతెనపై తొమ్మిది మంది చిక్కుకుపోయారు. ఈ సమయంలో హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్‌ వారందరినీ రక్షించారు.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో జేసీబీని ఉపయోగించి చేసిన రెస్క్యూ ఆపరేషన్‌ విజువల్స్ అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియోలో జేసీబీ కొందరు వ్యక్తులను కాపాడే సన్నివేశాన్ని మనం చూడొచ్చు. బురద నీటిలో మునిగిపోయిన కారుపై నలుగురు వ్యక్తులు రెస్క్యూ కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ వీడియోను భాగస్వామ్యం చేస్తూ, ఒక
X
వినియోగదారు "సుభాన్.. సుభాన్.. సుభాన్..
ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది.. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో." అంటూ పోస్టు పెట్టారు.


ఇది ఖమ్మంకు చెందినదిగా పేర్కొంటూ పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అటువంటి పోస్ట్‌లకు సంబంధించిన లింక్‌లు ఇక్కడ చూడవచ్చు.

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ వీడియో సౌదీ అరేబియాకు సంబంధించిందని, తెలంగాణకు చెందినది కాదని న్యూస్ మీటర్ గుర్తించింది.

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఈ వీడియో సౌదీ అరేబియాకు సంబంధించిందని తేలింది. ఏప్రిల్ 28, 2024న గల్ఫ్ న్యూస్ ద్వారా ఈ వీడియో షేర్ చేశారని మేము కనుగొన్నాము. ఈ నివేదిక ప్రకారం, సౌదీలోని బిషా ప్రావిన్స్‌లో వరదలు సంభవించినప్పుడు ఒక పౌరుడు వరదల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను రక్షించినప్పుడు తీసిన వీడియో. వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌లు, ఈ నివేదికలో కనుగొన్నాము. ఇది సౌదీకి చెందినదని తేలింది.

అదే విజువల్స్‌ని అనేక ఇతర స్థానిక అరబిక్ న్యూస్ అవుట్‌లెట్‌లు కూడా షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఆ న్యూస్ అవుట్ లెట్లు కూడా అదే వివరాలను ధృవీకరిస్తాయి. నివేదికల ప్రకారం.. బిషాలోని లోయలో వరదలు సంభవించగా కొందరు వాహనంతో సహా వరదల్లో చిక్కుకుపోయారు. ఆ వాహనం కొట్టుకుపోవడానికి కొద్ది క్షణాల ముందు అయద్ బిన్ దఘాష్ అల్ అక్లాబి అనే వ్యక్తి కారులో చిక్కుకున్న నలుగురి ప్రాణాలను జేసీబీ సాయంతో రక్షించాడు.



ఈ వీడియో YouTubeలో ఏప్రిల్ 28, 2024న అబులౌయ్ నోట్‌బుక్ అనే ఛానెల్ ద్వారా అప్‌లోడ్ చేశారని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో ఉన్న అదే విజువల్స్ ఇందులో కూడా ఉన్నాయి.

హర్యానాకు చెందిన ఒక JCB డ్రైవర్ సుభాన్ ఖాన్ నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ అసలైన ఫుటేజ్ సెప్టెంబర్ 4న NDTV సంస్థ YouTube ఛానల్ లో అప్‌లోడ్ చేశారు. BBC న్యూస్ తెలుగు కూడా సుభాన్ ఖాన్ తో ఇంటర్వ్యూ చేసింది.


అందువల్ల, వైరల్ వీడియో సౌదీ అరేబియాకు చెందినదని, తెలంగాణకు సంబంధం లేదని మేము నిర్ధారించాము


Claim Review:ఖమ్మంలో 9 మంది ప్రాణాలను కాపాడిన JCB డ్రైవర్ కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Fact:వైరల్ వీడియో ఈ ఏడాది ప్రారంభంలో బిషా వరదల సమయంలో సౌదీ అరేబియాకు సంబంధించింది. ఈ వీడియోతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు.
Next Story