Hyderabad: తమిళనాడు, కన్యాకుమారి జిల్లా, పరైకోడు గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన వ్యక్తి, అక్కడే చేపల పులుసు తిని నిద్రపోయాడు, దాంతో దొరికి పోయాడు. దొరికిపోయిన దొంగ ఎవరో కాదు తెలుగు దేశం పార్టీ ప్రతినిధి సరిపెళ్ళ "మహాసేన" రాజేష్ అని క్లెయిమ్ చేస్తున్న వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు నగలు, నగదు లభించలేదు. నిరాశగా తిరిగి వెళుతున్న ఆ దొంగకు వంటగదిలో నుంచి చేపల పులుసు వాసన గుప్పున తగిలింది. అసలే ఆకలితో నకనకలాడిపోతున్న ఆ దొంగ వంటగదిలోకి దూరి చేపల పులుసు వేసుకుని పుల్లుగా తిన్నాడు. భుక్తాయాసం ఎక్కువై.. డాబాపైకెళ్లి కాసేపు పడుకుని తెల్లవారుజామునే పారిపోదామనుకున్నాడు.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.. ఈ దొంగను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సరిపెళ్ళ రాజేష్‌గా గుర్తించారు," అని ఈ వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ఆరోపించింది.
జూన్ 15వ తేదీన ఆంధ్ర జ్యోతి ప్రచురించినట్లు వార్త క్లిప్పింగ్ డేట్ లైన్ ద్వారా తెలుస్తోంది, కానీ ఏ సంవత్సరంలో జరిగిందనే స్పష్టత లేదు. ఈ న్యూస్ క్లిప్పింగ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
Fact Check:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. దొంగతనం చేయడానికి ప్రయత్నించి దొరికిపోయింది సరిపెళ్ళ "మహాసేన" రాజేష్ కాదు.
కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా సమయం వార్త పత్రిక 2020 జూన్ 16న ప్రచురించిన "దొంగతనానికెళ్లి.. చేపల పులుసు తిని నిద్రపోయాడు, చివరికి.." అనే కథనం దొరికింది. (ఆర్కైవ్)
ఈ కథనంలో వేరే వ్యక్తి చిత్రాన్ని ఉపయోగించి దొంగ పేరు సతీష్ అని పేర్కొన్నారు. వైరల్ చిత్రానికి, సమయం కథానంలో ఉపయోగించిన చిత్రాల మధ్య భేదాలను కింద చూడవచ్చు.
ఈ కథనాల ఆధారంగా వైరల్ న్యూస్ క్లిప్పింగ్లో ఉన్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.