Fact check: తెల్లజంటకు నల్ల కవలలు పుట్టారు, భర్త భార్యను అనుమానించాడు? నిజం ఏమిటి?

ఒక తెల్లజంటకు నల్ల కవలలు పుట్టడంతో భర్త భార్యను అనుమానిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  M Ramesh Naik
Published on : 9 Nov 2025 12:14 PM IST

Fact check: తెల్లజంటకు నల్ల కవలలు పుట్టారు, భర్త భార్యను అనుమానించాడు? నిజం ఏమిటి?
Claim:ఈ వీడియోలో చూపించిన సంఘటన నిజమేనని, తెల్లజంటకు నల్ల కవలలు పుట్టడంతో ఆసుపత్రిలో భర్త భార్యతో గొడవపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Fact:ఆ వీడియో నిజం కాదు. అది ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన వీడియో.

హైదరాబాద్: ఒక ఆసుపత్రిలో తెల్లవారైన భర్త భార్యతో వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో భర్త, “ఈ పిల్లలు నావి కావు, వీళ్లకు నల్ల చర్మం, నల్ల జుట్టు ఎలా వచ్చింది?” అంటూ వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ వీడియోను కొందరు సోషల్ మీడియా యూజర్స్ నిజమైన సంఘటనగా షేర్ చేసుకుంటున్నారు.ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను “తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లోళ్ళు. పుట్టిన కవల పిల్లలు ఇద్దరూ నల్లోళ్లు.” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.(Archive)

Fact Check

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ వీడియో తప్పు అని తేలింది.ఇది నిజమైన సంఘటన కాదు, AI ద్వారా సృష్టించిన వీడియో.

వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, దానిపై ‘@br_ai_ded’ అనే టిక్‌టాక్ యూజర్‌నేమ్ కనిపిస్తోంది.ఈ యూజర్‌నేమ్ ఆధారంగా పరిశీలించగా, BRAIDED అనే టిక్‌టాక్ అకౌంట్‌కి దారి తీసింది.

ఆ ప్రొఫైల్ వివరణలోనే, “ఈ పేజీలో పోస్ట్ చేసే వీడియోలు Artificial Intelligence (AI) సాయంతో రూపొందించబడ్డవి” అని స్పష్టంగా పేర్కొన్నారు.అదే వీడియోను ఆ ఛానెల్‌లో కూడా “AI ద్వారా రూపొందించబడింది” అని ట్యాగ్ చేశారు.

ఇంకా, ఈ వీడియోను Hive Moderation అనే AI కంటెంట్ డిటెక్షన్ టూల్ ద్వారా పరిశీలించగా,99.4% AI సృష్టించిన వీడియో అని ఫలితం వచ్చింది.





ఇదే వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ మేము కనుకొన్నాం.

వీడియోలోని ముఖ కదలికలు, శరీరభాగాల కదలికలు సహజంగా కనిపించకపోవడం, నేపథ్యం కూడా డిజిటల్ రూపంలో ఉండటం గమనించవచ్చు.

ఏ విశ్వసనీయ మీడియా సంస్థలు లేదా వార్తా నివేదికలు ఈ సంఘటనను ప్రస్తావించలేదు.

తెల్లజంటకు నల్ల కవలలు పుట్టడంతో భర్త భార్యను అనుమానించాడని చెబుతున్న వీడియో నిజం కాదు.ఈ వీడియో కృత్రిమ మేధ (AI) సాయంతో తయారు చేసినది.

అందువల్ల, ఈ క్లెయిమ్ తప్పు.

Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఆ వీడియో నిజం కాదు. అది ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన వీడియో.
Next Story