క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని,చెడు అలవాట్లకు బానిసగా మారి అప్పులు తీర్చేందుకు డబ్బుల కోసం తన సొంత మేనత్తపై తువ్వాలుతో హత్యా ప్రయత్నం చేసిన గుంతకల్లు వైసీపీ అధికార ప్రతినిధి యాగంటి సత్తిరెడ్డి. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమె మెడలోని 8 తులాల బంగారు గొలుసు తీసుకుని వ్యక్తి పరారయ్యాడు.
ఈ విషయాన్ని తెలుపుతూ X పై ఒక పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ఎంత వరకు సరైనదో మరియు నివేదించబడిన వీడియోలో నిందితుడు ఎవరో చూద్దాం.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వివరణాత్మక దర్యాప్తు చేసి, వివిధ మూలాధార కథనాలు మరియు వీడియోలను [link] పరిశీలించిన తర్వాత, అసలు నిందితుడు ఎవరు మరియు సంఘటన ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది అని మేము కనుగొన్నాము.
ఆంధ్రప్రదేశ్‌లోని గవరపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు (లక్ష్మీనారాయణమ్మ 67 ) ఇంట్లో సోఫాలో కూర్చుని ఉండగా లోపలకు వచ్చిన వ్యక్తి ఆమె వెనుకగా వెళ్లి తువ్వాలుతో ఆమె మెడను బిగించి గొలుసు చోరీకి ప్రయత్నించాడు. హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు గోవింద్, స్థానికంగా కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు , కేబుల్ టెక్నీషియన్ కావడంతో తరచూ పని నిమిత్తం ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తించిన గోవింద్ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆమె బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నం చేశాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమె మెడలోని 8 తులాల బంగారు గొలుసు తీసుకుని గోవింద్ పరారయ్యాడు.
ఈ షాకింగ్ సంఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది.ఈ సంఘటన జనవరి 26వ తేదీన జరిగింది. ఈ ఘటన తర్వాత వృద్ధురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) మరియు 394 (దోపిడీ) కేసులు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతోపాటు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
29వ జనవరి ఉదయం నిందితుడు లొంగిపోయినట్లు బాధితురాలి కుమారుడు తెలిపారు.
కాబట్టి మేము నిజమైన నిందితుడు గోవింద్ స్థానికంగా కేబుల్ టెక్నీషియన్ అని నిర్ధారించాము. గుంతకల్లు వైసీపీ అధికార ప్రతినిధి యాగంటి సత్తిరెడ్డి నిందితుడు అని వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ .