Fact Check: వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ అన్నారంటూ వచ్చిన వార్త అవాస్తవం

నారా లోకేష్ తాడేపల్లి సమావేశాలలో వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు, ఈ వార్తా కథనం ఫేక్.

By Sridhar  Published on  9 April 2024 1:09 PM GMT
Nara Lokesh said the State destroyed because of volunteers in Andhra Pradesh, Nara Lokesh on Volunteers in AP

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ YSRCP, ప్రతిపక్ష పార్టీ TDP హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు అని అనేక మంది నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో, వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నట్లు Way2News ప్రచురించిన కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
"వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైంది: నారా లోకేశ్
AP: వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని, ఇంటింటికీ పథకాలు అందించి.. ప్రజల్ని సోమరపోతుల్ని చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని అపార్ట్ మెంట్ వాసులతో ఆయన భేటీ అయ్యారు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని, తెలుగుదేశాన్ని గెలిపిస్తే జన్మభూమి కమిటీలను పునరుద్ధరిస్తామన్నారు. వయసు రీత్యా ఇద్దరు, ముగ్గురు వృద్ధులు చనిపోతే.. టీడీపీకి ఆపాదించడం సమంజసం కాదన్నారు." అని వార్తా కథనం పేర్కొంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ చెలామణిలో ఉన్న ఈ వార్తా కథనాన్ని నకిలీగా కనుగొంది.
వార్తా కథనంలో రాసినట్టుగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని అపార్ట్ మెంట్ వాసులతో నారా లోకేశ్ భేటీకి సంబంధించిన వీడియోల కోసం వెతకగా మేము యూట్యూబ్ లో కొన్ని వీడియోలను [ 1, 2 ] కనుగొన్నము.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని అపార్ట్ మెంట్ వాసులతో నారా లోకేశ్ భేటీకి సంబంధించిన రెండు చోట్ల జరిగిన సమావేశాల మొత్తం ప్రత్యక్ష ప్రసారాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కనుగొన్నది ఏమిటి అంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లోని అపార్ట్మెంట్ వాసులతో మార్చి 25న బ్రేక్ ఫాస్ట్ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు .

ఆ తర్వాత ఏప్రిల్ 6న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లోని అపార్ట్మెంట్ వాసులు, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులతో భేటీ అయ్యారు.

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సమావేశాలకు సంబంధించిన ఈ రెండు వీడియోలు లొకేషన్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు తెర, నారా లోకేష్ వెనుక ఉన్న సెక్యూరిటీ గార్డు వైరల్ న్యూస్ కథనంతో అన్నీ సరిపోలుతున్నాయి.
అయితే ఈ రెండు సమావేశాలలో నారా లోకేష్ వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ సమావేశాలలో వాలంటీర్లపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ వీడియోలలో కనిపించడం లేదు.
అయితే, ఈ రెండు సమావేశాలలో, నారా లోకేష్ ని మంగళగిరిలో గెలిపించుకుంటే, అధికారంలోకి వస్తే టీడీపీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడిన అనంతరం సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
మరింత శోధిస్తున్నప్పుడు, ఈ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొంటూ టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మాకు ఒక పోస్ట్ కనిపించింది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ

మేము X లోని Way2News యొక్క అధికారిక ఖాతా ద్వారా కథనం నకిలీదని మరియు ఆ కథనాన్ని వారు ప్రచురించలేదని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను కూడా కనుగొన్నాము.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

పైగా నారా లోకేష్ వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ ఎలాంటి వార్తా కథనాలు, న్యూస్ ఛానెళ్ల రిపోర్టింగ్‌లు మాకు కనిపించలేదు.
అందుకే, వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ చెప్పినట్లు వచ్చిన Way2News వార్తా కథనం ఫేక్ అని నిర్ధారించాము.
Claim Review:A news article claimed that Nara Lokesh said the state was destroyed because of volunteers.
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story