మతుకుమిల్లి శ్రీభరత్, 2019లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు, ఆయన 2024లో మళ్లీ విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేశారు.అయితే ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్‌లో జరిగిన బహిరంగ చర్చకు సంబంధించిన ఆయన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం , ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే పొజిషన్ లో స్టేట్ గవర్నమెంట్ లేదు. విశాఖపట్నమే ఇంకా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అమరావతి అన్నది ట్వంటీ ఇయర్స్ స్టోరీ, కాబట్టి విశాఖపట్నం వలన ఆంధ్ర డెవలప్ అవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది" అంటూ బహిరంగ చర్చకు సంబంధించిన ఆయన మాటలు మనం ఈ వైరల్ వీడియోలో వినగలం.
ఆర్కైవ్ చేసిన లింక్
నిజ నిర్ధారణ:
విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని YCP నిర్ణయానికి భరత్ మద్దతు ఇస్తూ మాట్లాడారనే వార్త అవాస్తవమని, వైరల్ వీడియో ఎడిట్ చేయబడి తప్పుగా చూపబడింది న్యూస్‌మీటర్ తేల్చింది.
మతుకుమిల్లి శ్రీభరత్ వైరల్ వీడియో సంబంధించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు,
టీడీపీ నేత భరత్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా Xలో చేసిన
పోస్ట్‌ను మేము కనుగొన్నాము,ఆ పోస్ట్‌లో వైరల్ వీడియోను ఎడిట్ చేసి తప్పుగా షేర్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. వీడియో ఎలా ఎడిట్ చేయబడిందో చూపించడానికి అతను పూర్తి వీడియోను కూడా పంచుకున్నాడ
వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని పేర్కొంటూ యూట్యూబ్‌లో మే 8న TV5 న్యూస్ ద్వారా ప్రసారమైన వార్తా నివేదికను కూడా మేము కనుగొన్నాము.
వాస్తవానికి, మొత్తం
వీడియోలో మతుకుమిల్లి శ్రీభరత్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడారు.
అయితే భరత్ చేసిన ఈ వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం కాబట్టి విశాఖపట్నం వలన ఆంధ్ర డెవలప్ అవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది అంటూ ఆయన అన్నట్టు రూపొందించారు. కానీ భరత్ ఈ చర్చలో ఎక్కడా కూడా అలా అనలేదు.
అందువల్ల, టీడీపీ నేత భరత్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తన మద్దతు తెలుపుతూ మాట్లాడినట్టు వచ్చిన వీడియో క్లిప్ ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.