రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ప్రయాణించే మహిళలకు పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని వారు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లను (1091 మరియు 7837018555) సంప్రదించవచ్చు మరియు వారిని సురక్షితంగా వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి సమీపంలోని PCR లేదా SHO వాహనం పంపబడుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల పేరిట ఓ మెసేజ్ ప్రచారంలో ఉంది
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ గురించి పరిశోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మేము రాచకొండ పోలీసులుని సంప్రదించాము. ఈ నంబర్ తెలంగాణ పోలీసులకు చెందినది కాదని రాచకొండ పోలీసులు, షీ టీమ్ ధృవీకరించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత రైడ్ సర్వీస్ అందిస్తున్నారా అని ఆరా తీస్తే, ప్రస్తుతం అలాంటి సర్వీస్ ఏదీ లేదని నిర్ధారించారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ సమయంలో అలాంటి సేవలను అందించడం లేదు అని వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని తెలియచేసారు.
అంతేకాకుండా, 78370 18555 నంబర్‌కు తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని
Rachakonda Police ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 100ను సంప్రదించాలని కోరారు.
2024 ఆగస్టు 22న, Xలో
Hyderabad City Police ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో హైదరాబాద్ పోలీసులు అందిస్తున్న "ఉచిత రైడ్ సర్వీస్" గురించి సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని మేము చూశాము, ఇది సరైనది కాదు, భాగస్వామ్యం చేయడానికి ముందు ఎల్లప్పుడూ విశ్వసనీయ మూలాధారాలతో వాస్తవాలను ధృవీకరించండి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల అనవసర భయాందోళనలు కలుగుతాయి అంటూ కార్డుతో పోస్ట్ చేయబడింది.
అదనంగా, హెల్ప్‌లైన్ నంబర్ 7837018555’ కోసం శోధిస్తున్నప్పుడు, లూథియానా పోలీసులు మహిళల కోసం ‘ఫ్రీ రైడ్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టారని పేర్కొంటూ డిసెంబర్ 1, 2019న
Hindustan Times ప్రచురించిన నివేదికను మేము చూశాము.ఆ నివేదికలో ఒక మహిళ ఒంటరిగా ఉండి, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య రవాణా సౌకర్యం లేకుంటే, ఆమె సహాయాన్ని అభ్యర్థించడానికి పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లైన ‘112’, ‘1091’ లేదా ‘7837018555’కు కాల్ చేయవచ్చు అంటూ మరింత సమాచారంతో పేర్కొంది.
అయితే., లూధియానా పోలీసులు ప్రస్తుతానికి ఈ సేవను అందించడం లేదు
అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.