పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్, టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన ప్రతి రంగంలోనూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ, మండల స్థాయిలో టోల్ విధానం అమలు చేయాలని మరియు ప్రైవేట్ భాగస్వాములతో టోల్ వసూలు చేయడం ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 27న
Telugu Desam Party ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో డిప్యూటీ సియం పవన్ గారు, ఇలాంటి నిర్ణయం ఏదీ ప్రకటించలేదు. ఇది కేవలం ఫేకు జగన్ సృష్టించిన, ఫేక్ న్యూస్..అంటూ ఫేక్ న్యూస్ అనే స్టాంపుతో వైరల్ న్యూస్ కార్డ్ పోస్ట్ చేయబడింది.
అంతేకాకుండా, 2024 జూలై 27న, X లో
FactCheck.AP.Gov.in ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో గ్రామాల్లో, మండలాలలో టోల్స్ వసూలు చేస్తారని వస్తున్న కథనం పూర్తిగా అవాస్తవం. ప్రజల్లో అపోహ కలిగించేలా, కొంతమంది దురుద్దేశ్యంతో సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మవద్దు అని పేర్కొంది.
అదనంగా, ఈ పోస్ట్, న్యూస్ కార్డ్ రూపంలో ప్రసారం చేయబడింది కానీ ఎటువంటి వార్తలకు సంబంధించి మీడియా నివేదికలు లేదా ప్రభుత్వ అధికారుల నివేదికలు లేవు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి బహిరంగ ప్రకటన చేసినట్లు రుజువు లేదు అని మేము నిర్ధారించాము.
అందువల్ల, పవన్ కళ్యాణ్ గ్రామాల్లో, మండలాలలో టోల్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.