2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరియు ఇతర వ్యక్తుల సమూహం తో హిందూ దేవుడు లార్డ్ రామ్ ఫోటో ఫ్రేమ్‌ను పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ ఫోటోలో, ఈ ఎన్నికల్లో తన ఓటమిని పసిగట్టిన ఓవైసీ హిందూ మతం నుండి మద్దతు కోరుతున్నట్లు పోస్ట్ పేర్కొంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ
నిజ నిర్ధారణ :
ఒవైసీ, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకుని కనిపించాడు, రాముడు కాదు అని న్యూస్‌మీటర్ కనుగొన్నది.
మా పరిశోధనలో మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, ఈ వైరల్ ఫోటో కి సంబంధించిన పోస్ట్ 07 ఏప్రిల్ 2018న అసదుద్దీన్ ఒవైసీ యొక్క అధికారిక
ఫేస్‌బుక్ పేజీలో ""మోచి కాలనీకి చెందిన దళితులు AIMIM పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒవైసీని కలుసుకున్న వారి రామ్నాస్‌పురా డివిజన్, బహదూర్‌పురా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు అంటూ తనకు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గారు ఫోటో ఫ్రేమ్‌ను బహుమతిగా ఇచ్చిన ఫోటో ను తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు
అయితే భభీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గారు ఫోటో ఫ్రేమ్‌ను బహుమతిగా తీసుకుతున ఫోటో ని డిజిటల్‌గా ఎడిట్ చేసి రాముడు ఫోటో మార్చారు అని మేము కనుగొన్నాము.
అందువల్ల, 2024 లోక్‌సభ ఎన్నికలకు ఒవైసీ హిందూ మతం నుండి మద్దతు కోరుతున్నారు అనే క్యాప్షన్‌తో ఒవైసీ రాముడి చిత్రపటాన్ని పట్టుకుని ఉన్నతు ఫోటో ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.