Fact Check : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కులాల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను విడుదల చేసిందంటూ వచ్చిన జాబితా నిజం కాదు

వైరల్ అవుతున్న కులాల వారీగా ఓటర్ల జాబితా నకిలీవని మరియు అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  30 May 2024 12:58 AM IST
Fact Check : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కులాల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను విడుదల చేసిందంటూ వచ్చిన జాబితా నిజం కాదు
Claim: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కులాల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను విడుదల చేసిందంటూ వచ్చిన జాబితా
Fact: వైరల్ అవుతున్న కులాల వారీగా ఓటర్ల జాబితా నకిలీవని మరియు అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

2024 మే 13న, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (ECAP) యొక్క పాత్ర మరింత కీలకంగా మరిది. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతను నిర్ధారించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (ECAP) ఎంతో జాగ్రత్తగా సమన్వయం చేసిన చర్యలను అమలు చేస్తుంది. ఈ చర్యలు ప్రజాస్వామ్య సూత్రాలైన పారదర్శకత, న్యాయం మరియు ఖచ్చితత్వాన్ని కాపాడటానికి రూపొందించబడ్డాయి.


ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన వివిధ నియోజకవర్గాల్లోని కులం ఆధారంగా పోలైన ఓట్లు సంఖ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (ECAP) విడుదల చేసింది అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టులో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కులం ( కాపులు, బలిజలు, ఎస్సీ మాల, రెడ్డిలు, మాదిగ, యాదవ, ముస్లింలు, కమ్మ, గౌడ, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు,వాల్మీకి బోయలు, కొప్పుల వెలమ, పద్మశాలీలు, రజకులు, బ్రాహ్మణులు, వడ్డెరలు, కురుబ, నాయీ బ్రాహ్మణులు, క్షత్రియులు, కళింగులు, క్రిష్టియన్లు, యానాదులు, కంసాలి, గవర, కుమ్మరి, ఉప్పర్లు, దూదేకులు, ఎరుకలి, పొలినాటి వెలమలు, ముదిరాజులు, సుగాలి, బగతలు) యొక్క ఓటర్ల సంఖ్య జాబితాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతూ ఉంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ


నిజ నిర్ధారణ :


వైరల్ అవుతున్న కులాల వారీగా ఓటర్ల జాబితా నకిలీవని మరియు అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 మే 20న, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్(Chief Electoral Officer, Andhra Pradesh) ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో చలామణి అవుతున్న కులం ఫోల్లింగ్ డేటా నకిలీది మరియు షేర్ చేయబడే సమాచారం పూర్తిగా కల్పితమని మరియు తప్పుడు సమాచారంతో మోసపోవద్దని ఎన్నికల సంఘం హెచ్చరిచింది

అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లో కులాల వారీగా ఓటరు వివరాలను ఎన్నికల సంఘం ప్రకటిచలేదు మరియు కుల ఆధారిత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం జారీ చేయడంపై మీడియా నివేదికలు కూడా మాకు కనిపించలేదు.

అయితే, మార్చి 9న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీ పాలన అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహించాలనే తన పార్టీ సంకల్పాన్ని నొక్కిచెప్పారు మరియు ఆర్థిక మ్యాపింగ్‌తో పాటు ఈ సరైన చర్య ఆధారంగా, రిజర్వేషన్‌పై 50% పరిమితిని "మూలించబడుతుందని" అని అన్నారు

కుల గణన, ఎకనామిక్ మ్యాపింగ్ - దీని ఆధారంగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తాం, ఈ దశ దేశాన్ని "X-రే" చేస్తుంది మరియు అందరికీ సరైన రిజర్వేషన్లు, హక్కులు మరియు భాగస్వామ్యాన్ని అందిస్తుంది. ఇది పేదల కోసం సరైన విధానాలు మరియు ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడటమే కాకుండా విద్య, సంపాదన, ఔషధాల పోరాటం నుంచి వారిని రక్షించడంలో మరియు అభివృద్ధి యొక్క ప్రధాన స్రవంతిలో వారిని కనెక్ట్ చేయడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మేల్కొలపండి, మీ గళాన్ని పెంచండి, కుల గణన మీ హక్కు మరియు ఇది మిమ్మల్ని కష్టాల చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తుంది అని రాహుల్ గాంధీ అన్నారు.

అందువల్ల, కులం ఆధారంగా పోలైన ఓట్లు సంఖ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (ECAP) విడుదల చేసింది అంటూ వచ్చిన పోస్ట్‌లో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కులాల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను విడుదల చేసిందంటూ వచ్చిన జాబితా
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న కులాల వారీగా ఓటర్ల జాబితా నకిలీవని మరియు అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story