Fact Check : చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శిస్తుండగా, అసభ్యకరమైన చిత్రం తెరపైకి వచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  17 July 2024 11:46 AM IST
Fact Check : చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శిస్తుండగా, అసభ్యకరమైన చిత్రం తెరపైకి వచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Claim: చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శిస్తుండగా, అసభ్యకరమైన చిత్రం తెరపైకి
Fact: వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.

ధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 9 జూలై 2024 న సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం (SLBC Meeting) జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఈ నేపథ్యంలో, బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు PPT ప్రెసెంటేషన్ ఇస్తుండగా అసభ్య చిత్రం అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది అంటూ ఒక వీడియో పోస్ట్ వైరల్‌గా మారింది.




ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:



వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ ను పరిశోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చంద్ర బాబు నాయుడు ప్ర‌జెంట్ చేసిన ప‌వ‌ర్‌పాయింట్ (PPTT) వీడియోలో అసభ్యకరమైన ఇమేజ్‌ని చొప్పించి ఎడిట్ చేసినట్లు మా విచారణలో తేలింది. నాయుడు చేతి కదలికలను గమనించడం ద్వారా వీడియో స్క్రీన్ మూలలో చంద్ర బాబు నాయుడు చేతి పైన ఆ చిత్రం సవరించబడింది అని స్పష్టంగా చూడవచ్చు.



అధికారులకు చంద్రబాబు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారో తెలుసుకోవడానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రత్యక్ష ప్రసారం చూశాం. మేము ఈ ప్రసారం చూస్తున్నప్పుడు, PPT ప్రజెంటేషన్‌కు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో చంద్ర బాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు అని మేము కనుగొన్నాము.

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో అసభ్యకరమైన చిత్రంతో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మేము నిర్ధారించాము.
Claim Review:SLBC సమావేశంలో చంద్రబాబు నాయుడు PPT ప్రెసెంటేషన్ ఇస్తుండగా అసభ్య చిత్రం అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది అంటూ వైరల్ అవుతున్న పోస్ట్
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story