Fact Check: కేటీఆర్ కోసం దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేసారని క్లెయిమ్ చేస్తున్న ఫోటో వైరల్.

By K Sherly Sharon  Published on  7 Jan 2025 5:04 PM IST
Fact Check: కేటీఆర్ కోసం దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim: ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారు.
Fact: ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి తయారు చేసినది.
Hyderabad: ఫార్ములా ఈ-రేస్ కేసులో భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కే టీ రామారావుపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇటీవలే ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హై కోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవ్వకుండా అవ్వకూడదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేయించారని ఆరోపిస్తున్న క్లెయిమ్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్లెయిమ్స్ చేస్తున్న ఫోటో Way2News ప్రచురించే న్యూస్ కార్డు ఫార్మటులో ఉంది.
"కేటీఆర్ కోసం దివ్వెల ప్రత్యేక పూజలు" అనే శీర్షికతో "ఏసీబీ, ఈడీ అధికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో విచారణకు వెళ్తున్న కేటీఆర్ అరెస్ట్ కాకుండా క్షేమంగా బయటకు రావాలని టెక్కలిలోకి సాయిబాబా ఆలయంలో దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేయించారు" అని ఫొటోలో క్లెయిమ్ చేశారు.
కేటీఆర్ తనకు మంచి మిత్రుడని గతంలో మాధురి ఇంటర్వ్యూలో చెప్పారంటూ ఈ న్యూస్ కార్డులో ఆరోపించారు.
ఈ క్లెయిమ్స్ "కేటీఆర్ కోసం దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు అంట" అనే క్యాప్షన్‌తో
ఫేస్‌బుక్‌లో పోస్ట్
చేశారు. (ఆర్కైవ్)



ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్స్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న కథనం అసలు మనుగడలో లేదని కనుగొన్నాం.

దివ్వెల మాధురి కేటీఆర్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారా అని వివిధ కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. అయితే మాధురి కేటీఆర్ అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం పూజలు చేసినట్లు చూపించే కథనాలు మాకు దొరకలేదు.
ఈ క్లెయిమ్స్ చేస్తున్న ఫోటో మీద Way2News లోగో, లింక్ ఉన్నాయి. ఈ లింక్‌తో అనుబంధించబడిన కథనం ఏదీ లేదని మేము కనుగొన్నాం. Way2News వెబ్‌సైట్‌లో కూడా మాకు ఈ కథనం దొరకలేదు.
గతంలో "కేటీఆర్ కూడా నాకు మంచి మిత్రుడే: దివ్వెల మాధురి అన్నట్లు ఆరోపిస్తున్న" క్లెయిమ్ న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.
NTV తెలుగు యూట్యూబ్ ఛానెన్‌లో డిసెంబర్ 17, 2024న అప్లోడ్ చేయబడిన వీడియోలో మీడియాతో మాట్లాడుతూ మాధురి వైరల్ క్లెయిమ్‌లను కొట్టిపారేశారు. "నేను కేటీఆర్‌ని ఎప్పుడూ కలవలేదు, చూడలేదు, తెలంగాణ రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అని అన్నారు.
న్యూస్ కార్డులో కనిపిస్తున్న చిత్రాన్ని 2025 జనవరి 6న మాధురి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్నారు. ఈ ఫోటో క్యాప్షన్‌లో "వారణాసి" అని వ్రాసారు. అయితే న్యూస్ కార్డులో కనిపిస్తున్న ఫోటో మాధురి వారణాసిలో ఉన్నప్పుడు తీసిన ఫోటో అని అర్ధం అవుతోంది. (ఆర్కైవ్)
గతంలో కూడా ఫార్ములా ఈ-రేస్ కేసులో సంబంధించి క్లెయిమ్స్ వచ్చాయి. కేటీఆర్ సినీ నటి రకుల్ ప్రీత్ పెళ్లికి 10 కోట్లు ఇవ్వమని ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీని అడిగారంటూ వచ్చిన క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ వ్రాసింది.
ఇప్పుడు కూడా ఫార్ములా ఏ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదు అని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేసినట్లు చూపించే కథనాలు మాకు దొరకలేదు, వైరల్ అవుతున్న న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి తయారు చేసినది. కాబట్టి న్యూస్‌మీటర్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.
Claim Review:ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి తయారు చేసినది.
Next Story