ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024లో ప్రారంభ దశ నుంచి చివరి వరకు తెలుగు దేశం పార్టీ (TDP) శక్తివంతమైన ప్రదర్శనను కనబరచింది. YSRCPని అధిగమించి,NDA కూటమి 175 శాసనసభ స్థానాలలో 164 గెలుపొందింది. మరోవైపు YSRCP కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు పాటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు.
ఈ నేపథ్యంలో, YSRCP శ్రేణులు వేసిన ఓటర్ స్లిప్పులు బయట తుప్పల్లో పడేసి YSRCP ఓడిపోయేలా చేసారు. "ఏపీ ఎలక్షన్స్.. ఇలాంటివి ECకి కనిపించవు అంతే"" అంటూ అనేక మంది ఒక
వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియోలో పడి ఉన్న కరపత్రాలను, ఓటర్ల స్లిప్పులు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న
వీడియోని మరింత పరిశీలించినపుడు, నిజానికి వైరల్ వీడియోలో మనం చూసేది YSRCPకి సంబంధించిన కరపత్రాలు అని YSRCP శ్రేణులు వేసిన ఓటర్ స్లిప్పులు కావు అని కనుగొన్నాము.
వాస్తవానికి నిజమైన ఈవీఎం స్లిప్‌లో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుతో పాటు నెంబర్ మరియు దానిపై కోడ్ కూడా ఉంటాయి. అయితే వైరల్ వీడియోలో ఈ అంశాలన్నీ కనిపించవు కాబట్టి అవి ఓటర్ స్లిప్పులు కావు. దానికి బదులు జగన్ అన్నకి మన ఓటు అని ఉండడం మనం చూడవచ్చు, కనుక అవి కరపత్రాలు అని రుజువు అయింది.
అయితే YCP ఓటర్ VVPAT స్లిప్‌పై స్పష్టత కోసం మేము ఒక వీడియోను కూడా కనుగొన్నాము.అసలు ఈవీఎం ఓటర్ స్లిప్‌ని మనం
ఇక్కడ చూడవచ్చు.
అదనంగా, 27 సెప్టెంబర్ 2018, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో
Know Your EVM VVPAT అనే ఒక వీడియో ని కనుగొన్నాను. ఆ వీడియోలో VVPAT యంత్రం ఒక స్లిప్‌ను ముద్రిస్తుంది, అందులో అభ్యర్థి పేరు మరియు సంబంధిత ఎన్నికల గుర్తు ఉంటుంది మరియు ఆ స్లిప్‌ను ఆటోమేటిక్‌గా సీలు చేయబడిన పెట్టెలో వేస్తుంది.
VVPAT పారదర్శకమైన గాజు కేసులో ఉంచబడుతుంది, దీని ద్వారా ఓటరు తమ ఓటు చూడగలరు. ఓటరు స్లిప్ అనేది సుమారు ఏడు సెకండ్ల పాటు ఓటరుకు చూపబడుతుంది. తరువాత అది నిల్వ పెట్టెలో వేయబడుతుంది మరియు ఈ చర్యను ధృవీకరించడానికి ఒక బీప్ వినిపిస్తుంది. VVPAT యంత్రాన్ని పోలింగ్ అధికారులు పొందవచ్చు, కానీ ఓటర్లు మాత్రం పొందలేరు.
అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో YSRCPకి సంబంధించిన కరపత్రాలు అని YSRCP శ్రేణులు వేసిన ఓటర్ స్లిప్పులు అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.