2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష TDP కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో, ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, గతంలో YSRCP ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది, అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన TDP కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది మరియు 5 లక్షలకే కవర్ చేసే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించమని ప్రజలను కోరారు అంటూ టీడీపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో YCP శ్రేణుల షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు TDP కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను
శోధించడానికి, జూలై 28, 2024 జరిగిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారాలను చూశాం, ఆ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాలు ఉన్నాయి, ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం
సరిగ్గా మేనేజ్ చేసికుని నిధులు ఇస్తే కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్‌లో చేయవచ్చు అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే పథకం ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి 5,00,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లభిస్తుంది, ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఒక్కరికి చేరాలి ఎందుకంటే ఈ స్కీమ్‌లో చాలా మంది నమోదు కాలేదు అంటూ మరిన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు లావాదేవీలు గురించి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
అయన్న ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను ప్రెస్ మీట్ వీడియో నుండి ట్రిమ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మేము నిర్ధారించాము.
అంతేకాకుండా, మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత
శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 30న
Dr. Chandra Sekhar Pemmasani (గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి) ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో PM ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ కి ప్రత్యామ్నాయం కాదు, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణను విస్తరించడంలో ముఖ్యమైన జోడింపు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు NDA ప్రభుత్వ విజన్‌ని అర్థం చేసుకున్నారు మరియు ఇటువంటి రాజకీయ ప్రేరేపిత ప్రయత్నాలకు ప్రజలు బలైపోరు అంటూ పోస్ట్ చేయబడింది.
అదనంగా, 2024 జూలై 30న, X లో
FactCheck.AP.Gov.in ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ఆరోగ్యశ్రీ నిలిపివేత ప్రచారం అవాస్తవం. దురుద్దేశ్య పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సరికొత్తగా ప్రభుత్వం ఇప్పుడు "ఎన్‌టీఆర్ వైద్య సేవ స్కీమ్" పేరున 25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలను అమలు చేస్తోంది అని పేర్కొంది.
అందువల్ల, TDP కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది అంటూ వచ్చిన పోస్ట్‌లో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.