Fact Check : కూటమి ప్రభుత్వం APలో పవర్ స్టార్ అనే కొత్త మద్యం బ్రాండ్‌ను ప్రారంభించలేదు

వాస్తవానికి 999 పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుంచి అందుబాటులో ఉంది.

By Badugu Ravi Chandra  Published on  6 July 2024 1:29 PM GMT
Fact Check : కూటమి ప్రభుత్వం APలో పవర్ స్టార్ అనే కొత్త మద్యం బ్రాండ్‌ను ప్రారంభించలేదు
Claim: కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో "999 పవర్ స్టార్" విస్కీని అందుబాటులోకి తెచ్చింది అంటూ వైరల్ అవుతున్న పోస్ట్
Fact: వాస్తవానికి పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుండి ఆంధ్ర ప్రదేశ్‌లో అలాగే అనేక ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభ్యమయ్యే మద్యం బ్రాండ్‌లపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగేది. ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా లభించే లేదా విక్రయించే ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, బూమ్ బూమ్ మరియు ఇతర బ్రాండ్‌లు హానికరం మరియు ప్రమాదకరమైనవి అని టిడిపి నాయకులు మరియు పౌరులు దీనిపై కఠినమైన వ్యాఖ్యలు చేశావళు.


ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో "999 పవర్ స్టార్" విస్కీని అందుబాటులోకి తెచ్చిందని అంటూ పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్!....ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి.. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబూ...అని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుండి ఆంధ్ర ప్రదేశ్‌లో అలాగే అనేక ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము 999 పవర్ స్టార్ట్ మద్యం బ్రాండ్ గురించి తెలుసుకోవాలి అని శోధిస్తున్నప్పుడు, COMPANY VAKIL వెబ్‌సైట్‌లో మేము 999 పవర్ స్టార్ బ్రాండ్ ట్రేడ్ మార్క్ సమాచారాన్ని కనుగొన్నాము అందులో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ రికార్డుల ప్రకారం
గ్రేట్ గాలియన్ లిమిటెడ్
999 పవర్‌స్టార్ ఫైన్ విస్కీ బ్రాండ్ యజమాని మరియు 2011-09-29న ట్రేడ్మార్క్ IP ఇండియా రికార్డ్స్ క్రింద న్యూఢిల్లీలో దరఖాస్తు చేయబడింది.

IP ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, Great Galleon Ltd ద్వారా ట్రేడ్‌మార్క్ క్లాస్ 35 కింద మద్యం వ్యాపారం, మద్యం నిర్వహణ, మద్యం పరిపాలన, మద్యం సంబంధిత కార్యాలయ విధులు, మద్యం తయారీ, మద్యం వ్యాపారులు మరియు మద్యం వ్యాపారులు చేర్చబడ్డారు.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూలై 02న Telugu Desam Party ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నాడు. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశాడు జగన్, ప్రపంచంలో ఏడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం..జగనే తెచ్చిన బ్రాండ్లు అని పేర్కొంది.


అంతేకాకుండా, 2024 జూలై 2న వై.ఎస్.కాంత్ X ఖాతా ద్వారా 2022 లో మీరు తెచ్చిన బ్రాండే కదరా ఈ "999 POWERSTAR" విస్కీ? రాష్ట్రానికి అదేదో కొత్తగా వచ్చినట్టు & ఏమీ తెలియనట్టు నంగనాచి లాగ... ఈ FAKE PROPAGANDA ఎందుకురా లుచ్చా ఎధవల్లారా అంటూ పవర్ స్టార్‌తో సహా చాలా బ్రాండ్‌లను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని TV 5లో చెపుతున్న ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేయబడింది.



అదనంగా, న్యూస్‌మీటర్ మరింత శోధిస్తున్నప్పుడు, bhaskar ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక వార్తా నివేదిక కనుగొన్నాము, అందులో ఆగ్రాలోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోని గార్డు గది నుండి 1.5 లక్షల రూపాయల విలువైన 630 "999 పవర్ స్టార్ట్" మద్యం బాటిళ్లను సదర్ పోలీస్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ 2 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము.


29 నవంబర్ 2018, Khanna Police ఫేస్బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో సామ్రాల పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌ఐ ఆకాష్ దత్, పోలీస్ సభ్యులతో కలిసి 500 అక్రమ మద్యం బాక్సులను I.T.I సమీపంలో ట్రక్ నెం.PB-13-AB-7921లో స్వాధీనం చేసుకున్నారు, ఇందులో 200 బాక్స్‌లు EVERYDAY మద్యం బ్రాండ్, 150 బాక్స్‌లు 999-పవర్ స్టార్ మద్యం బ్రాండ్ మరియు నైనా విస్కీ మద్యం బ్రాండ్ యొక్క 150 బాక్స్‌లు రికవరీ చేయబడింది మరియు FIR నమోదు చేయబడింది అని పోస్ట్ చేయబడింది.


అందువల్ల, కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ పేరుతో 999 పవర్ స్టార్ విస్కీని అందుబాటులోకి తెచ్చిందని అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సి.ఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో "999 పవర్ స్టార్" విస్కీని అందుబాటులోకి తెచ్చింది అంటూ వచ్చిన పోస్ట్
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వాస్తవానికి పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుండి ఆంధ్ర ప్రదేశ్‌లో అలాగే అనేక ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story