ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలను YSRCP గెలుచుకుని ఘోర పరాజయం పాలైన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కనీసం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను కూడా పొందలేకపోయాడు.
ఈ నేపథ్యంలో, YSRCP ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీలో చేరాలని మరియు టిడిపి పార్టీ వైపు కృషి చేయాలని సీఎం చంద్రబాబును కోరారు అంటూ విజయ సాయి రెడ్డి మరియు చంద్రబాబు ఉన్న ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు 2023 లో జరిగిన నందమూరి తారకరత్న పెద్ద కర్మ సంబంధించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, మార్చి 3, 2023 న
సాక్షి టీవీ ఈటీ యూట్యూబ్ ఛానెల్‌లో Vijay Sai Reddy & Chandrababu Visuals @ Nandamuri Tarakaratna Pedda Karma | Balakrishna అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో మార్చి 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న ‘పెద్ద కర్మ’ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నందమూరి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ మరియు విజయ సాయి రెడ్డి దగ్గర ఉండి కార్యక్రమాన్ని చూసుకున్నారు.
అంతేకాకుండా, జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడి ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణించిన తర్వాత నుంచి ప్రతి కార్యక్రమాన్ని బాలయ్య మరియు విజయ సాయి రెడ్డి దగ్గర ఉండి జరిపించారు. రాజకీయాలని పక్కన పెట్టి బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి కలిసి తారకరత్న పెద్ద కర్మ చేయడం గొప్ప విషయం అని ఇద్దరినీ ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు.
అదనంగా, మార్చి 3, 2023 న
NTV Live యూట్యూబ్ ఛానెల్‌లో Nandamuri Taraka Ratna Pedda Karma : నందమూరి తారకరత్న పెద్ద కర్మ | NTV అనే టైటిల్ తో ఇంకో వీడియోను కనుగొన్నాము ఆ వీడియోలో నందమూరి చంద్రబాబు మరియు విజయ సాయి రెడ్డి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నా వీడియో క్లిప్ ని కనుగొన్నాము
అందువల్ల, YSRCP ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి TDP లో చేరేందుకు అనుమతించాలని సీఎం చంద్రబాబును కోరారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.