Fact Check: కొణిదెల నాగబాబు కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు అంటూ వచ్చిన వార్త నిజం కాదు

వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  7 Jun 2024 5:39 PM GMT
Fact Check: కొణిదెల నాగబాబు కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు అంటూ వచ్చిన వార్త నిజం కాదు
Claim: తిరుమల తిరుపతి దేవస్థానం తదుపరి చైర్మన్‌గా కొణిదెల నాగబాబు నియమితులయ్యారు
Fact: వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ రాజకీయ మార్పు చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP), పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (JSP) కలిసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)ఏర్పడి అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ విజయాన్ని సాధించడంలో ఒక కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్ లేకపోతే సాధ్యం అయ్యేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శనకు ఆయన ప్రత్యేక ప్రశంసలు అర్హులు.


ఈ నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు టీటీడీ చైర్మన్‌గా నియమించారు అంటూ సోషల్ మీడియాలో "TTD NEW CHAIRMAN SHRI. KONIDELA NAGENDRA BABU (NAGA BABU)" అనే టైటిల్ తో నాగబాబు యొక్క చిత్రాలు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ


నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు అది పుకారు అని న్యూస్‌మీటర్ కనుగొంది మరియు ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి నాగబాబును TTD ఛైర్మన్‌గా నియమించలేదు.


మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూన్ 06న,
నాగబాబు కొణిదెల ఖాతా
ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. అధికారిక పార్టీ హ్యాండిల్స్ లేదా నా సోషల్ మీడియా ఖాతాల నుండి సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దు లేదా ప్రచారం చేయవద్దు అని పేర్కొంది


అంతేకాకుండా, X లో 2024 జూన్ 06న, TV 9 తెలుగు ఖాతా ద్వారా అది ఫేక్ న్యూస్.. TTD Chairman Post పై Naga Babu రియాక్షన్ అంటూ ఒక TV9 లైవ్ వీడియో రిపోర్ట్ విడుదల చేసింది మరియు జూన్ 7, 2024 ఈనాడు దినపత్రికలో టీటీడీ చైర్మన్ పదవి....సమాధానం ఇచ్చిన నాగబాబు అనే వార్తలు మేము కనుగొన్నాము.

అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇంకా ఏర్పడనందున, రాష్ట్రంలో నియామకాలు నిజంగా ఇంకా సాధ్యం కాదు మరియు భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిన తర్వాత టీటీడీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేసినందున అప్పటి నుండి టీటీడీ చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు మరియు ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి నాగబాబు టీటీడీ చైర్మన్‌గా నియమించబడలేదు.

అందువల్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని టీటీడీ చైర్మన్‌గా నియమించారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు టీటీడీ చైర్మన్‌గా నియమించారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారింది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story