Fact Check : కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వాస్తవానికి 2017 సంవత్సరానికి చెందిన ఫోటో, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.
By Badugu Ravi Chandra Published on 9 July 2024 2:46 PM ISTClaim: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్స్ గుంతలను కొబ్బరికాయతో పూడ్చారు అంటూ వైరల్ అవుతున్న ఫోటో
Fact: వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ ఫోటో 2017 నుంచి సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది అని న్యూస్ మీటర్ కనుగొంది.
గతంలో ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై అధికార జగన్ మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అద్వానంగా తయారైందని, ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్ల పరిస్థితి దైన్యంగా మారి వాహనచోదకులకు చుక్కలు చూపిస్తుందని రోడ్లపై నిరసనను తెలియజేస్తూ రహదారులకు మరమ్మతులు చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్స్ గుంతలను కొబ్బరికాయతో పూడ్చారు అంటూ సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటో పోస్ట్‌కార్డ్ వైరల్ అవుతోంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ ఫోటో 2017 నుంచి సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది అని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము వైరల్ చిత్రాన్ని పరిశోధించడానికి ప్రయత్నించినప్పుడు, కొబ్బరికాయలతో పూడ్చిన రహదారిపై గుంతలను వర్ణించే వైరల్ చిత్రం కనీసం 2017 సంవత్సరం నుండి ఆన్‌లైన్‌లో ప్రసారమవుతుందని మేము కనుగొన్నాము. ఆ సంవత్సరం నాటి బ్రెజిల్ నుండి వచ్చిన అనేక పోస్ట్‌లలో ఇదే ఫోటో ఉంది, మరియు కొందరు అదే ఛాయాచిత్రంతో రోడ్ల అధ్వాన్న స్థితికి స్థానిక మేయర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
విస్తృత ప్రయత్నాలు చేసినప్పటికీ, మేము ఫోటోగ్రాఫ్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. చిత్రంలో గుర్తించదగిన ల్యాండ్‌మార్క్‌లు లేకపోవడం మరియు దాని మూలాన్ని నిర్ధారించే విశ్వసనీయ మూలాధారాలు లేకపోవడం వల్ల అది ఎక్కడికి తీశారో నిర్ధారించడం కష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఫోటో చాలా సంవత్సరాల నాటిది మరియు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను శోధిస్తున్నప్పుడు, 2017, సెప్టెంబర్ 23న Marcelo Brigila ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో బెత్లెహెం సిటీ కొబ్బరి పీచును తారు పేవింగ్ మరమ్మతులకు ప్రత్యామ్నాయ పదార్థంగా ఉపయోగిస్తోంది. 100% స్థిరమైన ప్రాజెక్ట్. మేయర్ జెనాల్డో మరియు కార్యదర్శులు ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఉన్నందుకు మరియు సుస్థిరత ప్రపంచానికి ఉదాహరణలను ఏర్పాటు చేసినందుకు అభినందనలు అంటూ గుంతలను కొబ్బరికాయతో నింపిన ఫోటో షేర్ చేయబడింది.
అంతేకాకుండా, 2019, ఏప్రిల్ 16న ifunny వెబ్‌సైట్ ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో బహియాలోని ఇటాబునా నగరం తారు పేవింగ్ మరమ్మతుల కోసం కొబ్బరి పీచును ప్రత్యామ్నాయ పదార్థంగా ఉపయోగిస్తోంది. స్థిరమైన ప్రాజెక్ట్. ఇటాబునా నగరానికి అభినందనలు, ఎల్లప్పుడూ సృజనాత్మకంగా, మార్గదర్శకుడిగా మరియు సుస్థిరత ప్రపంచానికి ఉదాహరణలు అంటూ ఫోటో షేర్ చేయబడింది.
అదనంగా, X లో 2024 జూలై 07న Telugu Desam Party ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో పనీ పాటా లేని పిల్ల సజ్జలకి, ఇంకా జగన్ రెడ్డి తెప్పించిన బ్రెజిల్ డ్రగ్స్ హ్యాంగ్ ఓవర్ దిగినట్టు లేదు. 2020లో బ్రెజిల్ ఫోటోలు తెచ్చి, ఏపి రోడ్లని నమ్మిస్తున్నాడు అంటూ ఫేక్ న్యూస్ అని దానికి సంబంధిత ఫోటోలను పోస్ట్ చేసింది.
పనీ పాటా లేని పిల్ల సజ్జలకి, ఇంకా జగన్ రెడ్డి తెప్పించిన బ్రెజిల్ డ్రగ్స్ హ్యాంగ్ ఓవర్ దిగినట్టు లేదు..
— Telugu Desam Party (@JaiTDP) July 7, 2024
2020లో బ్రెజిల్ ఫోటోలు తెచ్చి, ఏపి రోడ్లని నమ్మిస్తున్నాడు..
ఆ బొండాం తీసుకుని నెత్తి మీద ఒక్కటి పీకితే, ఎక్కింది మొత్తం దిగుతుంది.#YCPFakeBrathuku#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/WqX3VELM1P
X లో 2024 జూలై 07న FactCheck.AP.Gov.in ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం అధికారిక ఖాతా ద్వారా మరో పోస్ట్‌ని కనుగొన్నాము, అందులో 2020 సంవత్సరంలో బ్రెజిల్ లోని ఫోటోను, నేడు ఏపీలో జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి దానికి సంబంధిత ఫోటోలను పోస్ట్ చేయబడింది.
2020 సంవత్సరంలో బ్రెజిల్ లోని ఫోటోను, నేడు ఏపీలో జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి. pic.twitter.com/IbT8ycGn9U
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 7, 2024
అందువల్ల, కూటమి ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు చేయకుండా గుంతలను కొబ్బరికాయతో పూడ్చారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:ఆంధ్రప్రదేశ్‌లో TDP కూటమి ప్రభుత్వం రోడ్స్ మరమ్మతులు చేయకుండా గుంతలను కొబ్బరికాయతో పూడ్చారు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ ఫోటో 2017 నుంచి సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story