ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ కార్యకలాపాలను పెంచడానికి, టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రకారం, వినియోగదారులు డిపోల నుండి నేరుగా ఆన్‌లైన్ లోడింగ్ మరియు సీగ్నియరేజీ ఛార్జీలు చెల్లించడం ద్వారా ఉచిత ఇసుకను పొందవచ్చు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుకను కొనుగోలు చేసేందుకు ప్రజలు టన్నుకు భారీ ధర చెల్లించాల్సి వచ్చేది. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి రాష్ట్ర ప్రభుత్వానికి టన్నుకు రూ.375 చెల్లించేవారు. ఈ పద్ధతిలో భవన, నిర్మాణ రంగానికి అవసరమైన ముడిసరుకు ఇసుకను ప్రీమియం వస్తువుగా మార్చింది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పునః ప్రారంభించడంతో ప్రజలు మరింత లాభసాటి ధరకు ఇసుకను పొందవచ్చు.
ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని తన ట్రాక్టర్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం పై ప్రశంసలు కురిపించారు అంటూ సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ వీడియో 2019 వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధించినది అని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను శోధిస్తున్నప్పుడు, నవంబర్ 15, 2019 న
YSR Congress Party యూట్యూబ్ ఛానెల్‌లో AP Minister Kodali Nani Operated JCB at Sand Stock Point || Gudivada అనే టైటిల్ తో వీడియోను కనుగొన్నాము ఆ వీడియోలో మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలోని ఇసుక స్టాక్ పాయింట్ సందర్శించి దృశ్యం పోస్ట్ చేయబడింది.
అంతేకాకుండా, మేము వైరల్ వీడియోని పరిశోధించడానికి ప్రయత్నించినప్పుడు, నవంబర్ 15, 2021న జిల్లాలో ఇసుక వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలోని ఇసుక స్టాక్ పాయింట్ సందర్శించి ఇసుకను పరిశీలించిన వీడియోని కనుకున్నాము.
తన పర్యటనలో, కొడాలి నాని స్వయంగా ఒక JCB (ఎక్స్‌కవేటర్) ద్వారా ఇసుకను లారీలోకి ఎగుమతి చేశారు, తన పరిశీలన అనంతరం కొడాలి నాని సంఘటనా స్థలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని మాజీ ముఖ్యమంత్రి, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరత సమస్యను రాజకీయం చేస్తున్నారని, ఇసుక కొరతకు గత ప్రభుత్వ విధానాలు, నిర్వాకం వల్లనే కారణమని ఆయన ఆరోపించారు.
న్యూస్‌మీటర్ విచారణ తర్వాత, వైరల్ వీడియో మరియు దర్యాప్తులో కనుగొన్న వీడియో ఒకటేనని నిర్ధారించాము
అందువల్ల, టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందా లేదా అని మాజీ మంత్రి కొడాలి పరీక్షించేందుకు వెళ్లారు అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.