మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2 గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కిన బయోపిక్ యాత్రకు సీక్వెల్.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర 2’ బయోపిక్ విడుదలపై సోషల్ మీడియాలో ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO) సర్క్యులేషన్లో ఉంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి వచ్చిన GO, జిల్లాలు మరియు గ్రామాలలో సినిమాను ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది, ప్రక్రియను సులభతరం చేయడానికి అధికారులను మరియు థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోయేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఇది ప్రజలలో గందరగోళాన్ని రేకెత్తించింది, చాలా మంది ఈ ఆదేశాన్ని నమ్ముతున్నారు కూడా.
నిజ నిర్ధారణ:
ప్రభుత్వ ఉత్తర్వు నకిలీ మరియు కల్పితమని న్యూస్‌మీటర్ గుర్తించింది.
మా విచారణలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ ద్వారా X లో ఒక పోస్ట్‌ను మేము కనుగొన్నాము. ఆ పోస్టులో ఈ GO పూర్తిగా నకిలీదని, జనసేన పార్టీ (JSP) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ప్రయోగించిన “చౌక వ్యూహం” అని స్పష్టం చేస్తూ. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త వహించాలని పార్టీ ప్రజలను కోరింది.
GO లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పేరును చూడవచ్చు.
నిజానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ ఉన్నారు. అయితే, నీలం సాహ్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నవంబర్ 2019 నుండి జనవరి 2021 వరకు పనిచేశారు.
అందువల్ల యాత్ర 2 చిత్రం గురించిన GO నకిలీదని మేము నిర్ధారించాము.