ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 23 ఆగస్టు 2024న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పరిపాలనను పునరుద్ధరించడానికి ‘గ్రామసభలు’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిసారిగా ఒకేరోజు 13,226 గ్రామసభలు జరిగాయి. కోనసీమ జిల్లా స్వర్ణవనపల్లిలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనగా, అన్నమయ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ మా కన్నా గొప్ప వ్యక్తి ?....పెద్ద చదువుకున్నాడు?.... తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అని సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న స్పీచ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను శోధించడానికి, ఆగస్టు 23, 2024న కోనసీమ జిల్లా స్వర్ణవనపల్లిలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాలను చూశాం, ఆ
సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టాం. గ్రామసభ అంటే మీరే నిర్ణయించుకోవాలి, గ్రామ సభ ద్వారా గ్రామాల్లో ప్రజల అవసరాలను తీర్చాలని గ్రామ సభకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, నేరుగా నిధులను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని చంద్రబాబు అన్నారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మాకంటే గొప్ప వ్యక్తా, పెద్ద చదువుకున్నాడు, తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అలాంటి వ్యక్తి ఏం చేశాడో మీరే చూశారు అంటూ జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
అయితే చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మాట్లాడుతున్న వీడియోను 57:29 సెకన్లు నుంచి సెకన్లు 57:50 వరకు ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మేము నిర్ధారించాము.
అంతేకాకుండా, ఆగస్టు 23, 2024న
ABN Telugu యూట్యూబ్ ఛానెల్‌లో పవన్ కళ్యాణ్ కంటే గొప్పోడా జగన్.. అనే టైటిల్ తో ఒక వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ విమర్శిస్తూ విమర్శిస్తున్న వీడియో అప్‌లోడ్ చేయబడింది.
అందువల్ల, వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయలేదని మేము నిర్ధారించాము.