Fact Check : తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు కొడవలితో దాడికి పాల్పడిన జనసేన పార్టీ కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో పాతది, జనసేన పార్టీ కార్యకర్త పాల్పడినట్టుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  20 July 2024 2:46 PM GMT
Fact Check : తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు కొడవలితో దాడికి పాల్పడిన జనసేన పార్టీ కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Claim: తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు కొడవలితో దాడికి పాల్పడిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్
Fact: వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో పాతది, జనసేన పార్టీ కార్యకర్త పాల్పడినట్టుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.


తన బిడ్డని అల్లరి చేయొద్దని అన్నందుకు ఆ పెద్దామను ఆలయంలో కత్తితో అతి దారుణంగా దాడి చేసి చంపేసిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:


ఈ వైరల్ వీడియో 05 మార్చి 2024 కి చెందినది మరియు ఇటీవలిది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, 2024 మార్చి 05 న INDIA TODAY ఆన్‌లైన్ వార్తా ద్వారా Andhra man hacks wife to death, attack filmed, locals watch అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో రద్దీగా ఉండే వీధిలో ఓ వ్యక్తి తన భార్యను కొడవలితో నరికి చంపి, అత్తగారిని గాయపరిచాడు. ఈ క్రూరమైన దాడిని చూసిన జనం గుమిగూడి నిందితుడిపై దాడిని ఆపాలని కేకలు వేశారు అని మరింత వివరాలు మరియు వైరల్ వీడియోతో ఆ నివేదిక పేర్కొంది.

అంతేకాకుండా, 2024 మార్చి 05న NDTV ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో రంగస్వామి అనే వ్యక్తి తన భార్య కుమారి, ఆమె తల్లి పై కొడవలి లాంటి పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.వీక్షకులలో ఒకరు రికార్డ్ చేసిన భయంకరమైన వీడియోలో, రంగస్వామి కనికరం లేకుండా రోడ్‌సైడ్ స్టాల్స్ మధ్యలో నేలపై పడుకుని రక్తంతో కప్పబడి ఉన్న స్త్రీని కనికరం లేకుండా కొట్టడం కనిపిస్తుంది అంటూ ఒక కథనాన్ని మేము కనుకున్నాము.

మేము వైరల్ వీడియోకు సంబంధించి 05 మార్చి 05 నాటి India Today NE ట్విట్టర్ ఖాతాలో అదే విషయాన్ని నివేదించిన మరో న్యూస్ రిపోర్టింగ్ వీడియోని కనుగొన్నాము.


అందువల్ల, నిజానికి ఈ వైరల్ వీడియోలో ఉన్నది జనసేన పార్టీ కార్యకర్త కాదు అని, మరియు ఇటీవలిది అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.
Claim Review:తన బిడ్డని అల్లరి చేయొద్దని అన్నందుకు ఆ పెద్దామను ఆలయంలో కత్తితో అతి దారుణంగా దాడి చేసి చంపేసిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్ అంటూ వచ్చిన పోస్ట్
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో పాతది, జనసేన పార్టీ కార్యకర్త పాల్పడినట్టుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story