Fact Check : YSRCPని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వాస్తవానికి వైరల్ అయిన పత్రిక క్లిప్ ఫేక్ మరియు శివకుమార్ కార్యాలయం ఆరోపణను ఖండించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  3 July 2024 10:03 AM GMT
Fact Check : YSRCPని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Claim: YSRCP అధినేత జగన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై తన ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే యోచనలో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్త
Fact: వైరల్ అయిన పత్రిక క్లిప్ ఫేక్ మరియు శివకుమార్ కార్యాలయం ఆరోపణను ఖండించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని NDA (TDP-JSP-BJP) అధికారం నుండి తొలగించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 11 స్థానాలను మాత్రమే YSRCP గెలుచుకుంది.


ఈ నేపథ్యంలో, YSRCP అధినేత జగన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై తన ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే యోచనలో చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో న్యూస్ కార్డ్ రూపంలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.


ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీవని మరియు సవరించబడింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూన్ 30న DK Shivakumar ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో నేను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశానంటూ కొందరు అక్రమాస్తులు నకిలీ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని నేనెప్పుడూ కలవలేదు, దీన్ని ఎవరూ నమ్మకూడదు అని తన ఖాతా ద్వారా తెలియజేసారు.

అంతేకాకుండా, 2024 జూలై 1న South First ఆన్‌లైన్ వార్తా ద్వారా Jagan met with DK Shivakumar about merging both parties, claims a Telugu daily; Karnataka Dy CM debunks it as false అనే టైటిల్ తో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో గత వారం రోజులుగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసినట్టు వచ్చిన వార్తా కథనానికి సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. X పోస్ట్‌లో కథనాన్ని తప్పుడు వార్తగా పేర్కొన్న శివకుమార్, తెలియని దుండగులు తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారని ఆరోపించిన 'వార్తలు' నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంటూ పేర్కొంది.

అదనంగా, మేము అధికారిక మరియు ఇతర YSRCP ''X'' ఖాతాలు శోధించినప్పుడు, వైరల్ న్యూస్ పేపర్ క్లిప్‌కు సంబంధించి మాకు ఎటువంటి పోస్ట్ కనిపించలేదు

అందువల్ల, YSRCP అధినేత జగన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కలిసినట్టు వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.
Claim Review:YSRCPని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ వచ్చిన వార్త
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అయిన పత్రిక క్లిప్ ఫేక్ మరియు శివకుమార్ కార్యాలయం ఆరోపణను ఖండించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story