Hyderabad: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యక్ష రాజకీయాలకు పదవి విరమణ చేసి, అమెరికాలో స్థిరపడనున్నారంటూ క్లెయిమ్ చేస్తున్న న్యూస్ క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూస్ క్లిప్పింగ్ "ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం… న్యూయార్క్‌లో చింతలపూడి శకుంతల దేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు. పెళ్లి కాకముందు నుండి శకుంతల దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ షిప్..." అని పలు ఆరోపణలు చేస్తోంది.
న్యూస్ క్లిప్పింగ్ పై తెలంగాణ న్యూస్ టుడే లోగో, లింక్ ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఈ క్లిప్పింగ్ అప్లోడ్ చేయబడింది. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)
Fact Check
ఈ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ వార్తా సంస్థ ఉనికిలో లేదు.
కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, అమెరికా వెళ్ళబోతున్నట్లు చూపిస్తున్న విశ్వసనీయ వార్తా కథనాలు ఏవీ మాకు దొరకలేదు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాని, మరి వేరే ఎక్కడా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించలేదు.
న్యూయార్క్ నివాసి చింతలపూడి శకుంతల అనే మహిళ గురించి న్యూస్ క్లిప్పింగ్ పేర్కొంది, ఆమె ఆచూకీ కూడా మాకు దొరకలేదు.
ఈ వార్త సంస్థ గురించి గతంలో న్యూస్‌మీటర్ రాసింది. తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ ప్రచురించింది అని చూపిస్తున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్, అసలు ఆ సంస్థ ఉనికిలోనే లేదని తేలింది.
న్యూస్ క్లిప్పింగ్ బ్యానర్‌పై ఉన్న లింక్ మనుగడలో లేదు. గూగుల్, బింగ్‌లో వివిధ కీవర్డ్ శోధనలు నిర్వహించి, తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ-పేపర్ లేదా దాని వెబ్‌సైట్ ఎక్కడా లేదని కనుగొన్నాము.
Whois ఉపయోగించి telangananewstodaydaily డొమైన్ ఇంకా నమోదు కాలేదని కూడా కనుగొన్నాము. భారతదేశ వార్తాపత్రికల రిజిస్ట్రార్ కార్యాలయ వెబ్‌సైట్‌లో 'తెలంగాణ న్యూస్ టుడే', 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' అనే పేరుతో రిజిస్టర్ అయిన వార్త సంస్థల కోసం శోధించాము. ఈ శీర్షికలతో ఏ వార్త సంస్థ కూడా నమోదు కాలేదని కనుగొన్నాము.
ఈ వార్తా సంస్థ, అది ప్రచురిస్తున్నట్లు చూపిస్తున్న వార్తలు రెండూ ఉనికిలో లేవు. తెలంగాణ న్యూస్ టుడే డైలీ సంస్థ.. న్యూస్ క్లిప్పింగ్‌ల ద్వారా వస్తున్న అన్ని క్లెయిమ్స్ బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వాటిని వైరల్ చేయడానికే ఉపయోగించబడుతున్నట్లు కనిపిస్తోంది.
కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.