Fact Check: బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది

రిజర్వేషన్ల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తారుమారు చేశారు.

By Badugu Ravi Chandra  Published on  6 May 2024 5:54 PM IST
MP MP Bandi Sanjay makes sensational comments on reservations in a viral audio clip, MP Bandi Sanjay said that BJP will remove SC ST BC reservations
Claim: ‘రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, SC, ST, BC రిజర్వేషన్లు రద్దు చేస్తామని, అంబేద్కర్ వల్లనే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొని పార్టీ బీజేపీ’ అంటూ MP బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Fact: MP బండి సంజయ్ రిజర్వేషన్ల రద్దుపై వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది.

ఇటీవల, కరీంనగర్ [తెలంగాణ] నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, SC, ST, BC రిజర్వేషన్లు రద్దు చేస్తామని, అంబేద్కర్ వల్లనే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొని పార్టీ బీజేపీ’ అంటూ పలు వ్యాఖ్యలు బండి సంజయ్ ఈ ఆడియో క్లిప్‌లో అన్నట్టు మనం వినగలము. ఇలాంటి వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.




నిజ నిర్ధారణ:

బండి సంజయ్ రిజర్వేషన్ల రద్దుపై వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.

బండి సంజయ్ గారి వైరల్ ఆడియోకి సంబంధించి కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, యూట్యూబ్‌లో ఏప్రిల్ 28న జీ తెలుగు న్యూస్ ద్వారా ఒక వీడియోను కనుగొన్నాము.

బీజేపీ ఇంటర్నల్ మీటింగ్ ఆడియో లీక్ అంటూ షేర్ చేస్తున్న ఈ క్లిప్‌లోని వ్యాఖ్యలు నిజానికి బండి సంజయ్ బహిరంగంగా మీడియా ముందు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు రూపొందించారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని అని అన్నారు. ఐతే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్‌ల విషయంలో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

‘అంబేద్కర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ అని,అంబేద్కర్ వల్లనే మాకు ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పుకొలేని పార్టీ కాంగ్రెస్ అని’, ‘రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తోందని, మతపరమైన రిజర్వేషన్‌లు రద్దు చేసి వాటిని SC, ST, BC, అగ్రవర్ణాల్లోని పేదలకు ఇస్తామని' ఆయన వ్యాఖ్యానించారు.

ఐతే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని ఆయన అన్నట్టు రూపొందించారు. కానీ బండి సంజయ్ ఈ ప్రెస్ మీట్‌లో ఎక్కడా కూడా అలా అనలేదు. పైగా తాము రిజర్వేషన్‌లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో బండి సంజయ్ వైఖరిని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలను మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు .

Source - V6 Velugu


అందువల్ల బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్టు వచ్చిన ఈ ఆడియో క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేయబడిందని మేము నిర్ధారించాము.

Claim Review:బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని MP బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు ప్రచారంలో ఉన్న ఒక ఆడియో క్లిప్
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:MP బండి సంజయ్ రిజర్వేషన్ల రద్దుపై వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది.
Next Story