Fact Check : ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అంటూ వచ్చిన వీడియో వాస్తవానికి 2019 సంవత్సరానికి చెందినది

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on  9 Jun 2024 1:03 AM IST
Fact Check : ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అంటూ వచ్చిన  వీడియో వాస్తవానికి 2019 సంవత్సరానికి చెందినది
Claim: ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అందువల్ల విజయం సాధించింది
Fact: వైరల్ అవుతున్న వీడియో 2019 లో ఎస్. వీరయ్య చేసిన వ్యాఖ్యలు అని న్యూస్‌మీటర్ కనుగొంది.

2024 ఆంధ్రప్రదేశ్ లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో YSRCPని అధిగమించి ఎన్డీయే కూటమి గణనీయమైన విజయాలు సాధించింది అని మనకు తెలిసిందే. ఐతే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మిగిలిన పార్టీల కన్నా అతి తక్కువ సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు పాటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు.


ఈ నేపథ్యంలో, YSRCP శ్రేణులు తమ సోషల్ మీడియా ఖాతాలో ""ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అందువల్ల విజయం సాధించింది"" అంటూ ఒక వీడియో లో వీరయ్య చేసిన వ్యాఖ్యలు అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ


నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న వీడియో 2019 లో ఎస్. వీరయ్య, నవతెలంగాణ తెలుగు డైలీలో ప్రధాన సంపాదకుడు చేసిన వ్యాఖ్యలు.అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో జూన్ 12, 2019లో S. Veeraiah ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో పార్లమెంట్ ఎన్నికల్లో మిస్సైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ..? అనే ఒక యూట్యూబ్ వీడియో లింక్ ని కనుగొన్నాను. ఆ వీడియోలో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. మొదట, భారతదేశంలో 60 లక్షల ఈవీఎంలు తయారు చేయబడ్డాయని, కానీ అందులో 20 లక్షల ఈవీఎంలు అందుబాటులో లేనందున, ఈవీఎంల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేశారు


60 లక్షల ఈవీఎంలు కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని, ఎన్నికల కమిషన్ 40 లక్షల ఈవీఎంలను ఉపయోగించిందని అన్నారు. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం, సమాచార హక్కు కార్యకర్తలు ఆ వివరాలను కోరడం వంటి విషయాలను చర్చించారు. ఈవీఎంల గల్లంతు పై ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వకుండా ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్ స్ట్రాంగ్ రూంలో ఉన్న తర్వాత ఈవీఎంలను మార్చారా? అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, పోలింగ్ ఏజెంట్ల సంతకాలు, మరియు వేల ఓట్లు భిన్నంగా ఉండటం వంటి అంశాలను ప్రస్తావించారు.

అయితే, ఈవీఎంలపై పోలింగ్ ఏజెంట్ల ముద్రలు, సంతకాలు ధృవీకరించడంపై సమస్యలు ఉన్నాయి అని చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు కనిపించకపోవడం, సీల్ అసలైనదా కాదా అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు మార్చడం సాధ్యమా లేదా అనే అనుమానాలను ప్రస్తావించారు. మెచ్చిన సమాధానాలు రాకపోవడంతో ప్రజల్లో అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో 2019 లో ఎస్. వీరయ్య చేసిన వ్యాఖ్యలు.అని మరియు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ 2024 కు సంబంధం లేదని మేము నిర్ధారించాము.
Claim Review:ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అందువల్ల విజయం సాధించింది అంటూ ఒక వీడియో
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వీడియో 2019 లో ఎస్. వీరయ్య చేసిన వ్యాఖ్యలు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
Next Story