2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు, ప్రతి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలో మోదీ పాల్గొంటున్నారు మరియు అన్ని పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు, కేడర్ సమావేశాలు, భారీ రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో "ఇంత జానసముద్రం ఏంటి అని చూస్తున్నారా, మోదీ రోడ్ షో కొల్లాపూర్ లొ డబ్బు మద్యం ఏవి పంచలేదు కేవలం దేశం మీద ప్రేమ, మోదీ అభివృద్ధి మీద నమ్మకం, మోదీ మీద ఆశ. ఈ పేరు, హోదా చూసి ఓర్వలేకనే దేశంలొ ఉన్న అన్ని పార్టీలు ఎలా అయిన మోదీని దించాలి అని ఎన్నో చెత్త ప్లాన్స్ వేసి ఫెయిల్ ఐతున్నారు.
మోదీ మీద వేసిన ఒక్కొక్క రాయి ఒక్కొక్క విజయం సాధించడానికి వాడుతున్నాడు మోదీ. ఈ దెబ్బ తో ప్రతిపక్షలు అన్ని మూసుకొని కూచొవాల్సిందే. ప్రచారం కోసం ఖర్చు చేసే కోట్ల రూపాయలు వృధా" అని పేర్కొంటూ అనేక మంది ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో ఫోటో 2008లో చైనాలో ఒలింపిక్స్‌కు సంబంధించినది, ఇటీవలి రోడ్‌షోలది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు 2008 చైనాలో జరిగిన ఒలింపిక్ అథ్లెటిక్స్ చేపట్టిన రోడ్‌షోలో నాటి పోస్ట్‌ని కనుగొన్నాము.
అయితే మే 9న, 2008లో చైనాలో ఒలింపిక్స్ గురించి ప్రచురించబడిన “ది అట్లాంటిక్” అనే వార్తాలేఖ లో ఉన్న ఫోటోని మనం చూడవచ్చు. అదే ఫోటోని ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు.
వైరల్ అయిన ఫోటో గురించి మరింత శోధించగా, 2008 చైనాలో జరిగిన ఒలింపిక్ టార్చ్ రిలే ప్రారంభానికి ముందు ప్రజలు తమ మద్దతును తెలియజేయడానికి మరియు ఒలింపిక్ జ్వాలకి స్వాగతం పలికేందుకు ప్రజలు చేపట్టిన రోడ్‌షోలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
అంతేకాకుండా, మేము వైరల్ ఇమేజ్ గురించి వివరాలను కనుగొనడానికి గూగుల్ లెన్స్ సహాయాన్ని ఉపయోగించాము మరియు 'Flickr' అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో షేర్ చేయబడిన అదే దృశ్యాన్ని కనుగొన్నాము.
అందువల్ల, 2008లో చైనాలో ఒలింపిక్స్ సంబంధించిన ఫోటోని, ఇప్పుడు షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.